మెగా ప్రిన్సెస్ ఎంట్రీతో సంబరాల్లో ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. దాంతో మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉపాసన మంగళవారం తెల్లవారుజామున పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఇద్దరూ ఎంతో క్షేమంగా వున్నారని, మెగా కుటుంబంలో అందరూ రామ్ చరణ్ దంపతులకి సంతోషంగా విషెస్ చెబుతున్నారు. పవర్ కపుల్ అని పిలవబడుతున్న రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెలకి పండంటి పాపాయి పుట్టడంతో ఇన్నాళ్లూ ఎదురుచూస్తోన్న మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె వెంట, భర్త రామ్ చరణ్, అత్తగారు సురేఖ, ఆమె మదర్ అందరూ వెంట రాగ, నిన్న రాత్రి అపోలో హాస్పిటల్ లో చేరిన ఉపాసన ఈరోజు అంటే మంగళవారం తెల్లవారుజామున పండంటి పాపాయికి జన్మనిచ్చిందని ఆసుపత్రి ఒక ప్రత్యేక మెడికల్ బులెటిన్ విడుదల చేసింది.

ఇటు మెగా కుటుంబంలో, అటు కామినేని కుటుంబంలో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తన కూతురిని చూసి మురిసిపోయాడని అతని సన్నిహితులు చెప్పారు. ఈరోజు రెండు కుటుంబాల కి చెందిన సభ్యులు ఆసుపత్రికి వచ్చి రామ్ చరణ్, ఉపాసనలకి అభినందనలు తెలుపుతూ, అలాగే పుట్టిన పాపాయికి ఆశీర్వచనములు కూడా అందజేస్తారని మెగా ఫామిలీ టీం ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్ని రోజుల నుండి రామ్ చరణ్, ఉపాసనల వార్తలే ఎక్కడ చూసిన వైరల్ అయ్యాయి. ముందుగా ఉపాసన డెలివరీ డేట్ జులై అనుకున్నారు, కానీ తరువాత జూన్ 20 అని కన్ఫర్మ్ చేశారు, నిన్న ఆసుపత్రి లో జాయిన్ అయ్యారు.

అపోలో హాస్పిటల్ లో ఉపాసన కోసమని ఒక ప్రత్యేక రూమ్ సిద్ధం చేసి ఉంచారు. ఉపాసన, పుట్టిన పాపాయి ఇద్దరూ ఆరోగ్యాంగా వున్నారు అని సన్నిహితులు చెప్పారు. ఉపాసన మొదటి నుండీ కూడా చాలా కేర్ తీసుకుంది, డాక్టర్ల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యాన్ని చూస్తూ ఉండేవారు. అలాగే ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ ఈమధ్య చాలా ప్రాంతాలు తిరిగారు, అందులో ముఖ్యంగా ఆస్కార్ అవార్డు అందుకోవడానికి అమెరికా వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా ఈ ఇద్దరే కనపడేవారు. మెగా స్టార్ చిరంజీవి రాత్రి రామ్ చరణ్ తో మాట్లాడి తన సంతోషాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అలాగే రామ్ చరణ్ మదర్ సురేఖ హాస్పిటల్ లోనే వున్నారు, ఆమె కూడా ఎంతో సంతోషంగా వున్నారు అని తెలిసింది. మనవరాలిని ఆమె చూసి ఎంతో మురిసిపోయినట్టుగా.. ఇప్పుడు ఉపాసన కామినేని కొణిదెలకి పండంటి పాపాయి పుట్టడంతో ఇరుకుటుంబాల్లో పండగ వాతావరనమే చోటుచేసుకుందని సన్నిహితులు చెబుతున్నారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ..ఖుషీగా సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే మెగా కుటుంబంలో వరుస సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు మెగాస్టార్ నట వారసుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. రీసెంట్‌గా వీరి 11వ వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. ఇంతలోనే వీరి ఇంట్లో కొత్త వక్తి అడుగుపెట్టడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. అంతేకాదు రామ్ చరణ్, ఉపాసనలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన దంపతులు పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఈ జంట ఓ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఉపాసనకు పుట్టేది అమ్మాయే అంటూ ప్రచారం కూడా జరిగింది.

అలాగే వీళ్ల ఇంటికి ఓ లిటిల్ ప్రిన్సెస్ వచ్చింది. ఇక ఉపాసన డెలివరీ అయ్యే వరకు రామ్ చరణ్ తన సినిమా షూటింగ్స్’కు బ్రేక్ ఇచ్చారు. పెళ్లి తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గిన ఉపాసన, మంచి ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఇక ఉపాపన ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని అప్పట్లో స్వయంగా చిరంజీవి ప్రకటిస్తూ.. త్వరలో రామ్ చరణ్, ఉపాసన పేరెంట్స్ కాబోతున్నట్లు తన సోషల్ మీడియాలో తెలియజేశారు. ఆ ఆంజనేయ స్వామి కృపతో త్వరలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ అప్పట్లో సంబరాలు చేసుకున్నారు. ఎప్పటి నుంచో ఈ వార్త కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ల రూపంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి జూన్ 14, 2012న హైదరాబాద్‌లో ఘనంగా వైభవంగా జరిగింది. ఉపాసన విషయానికి వస్తే.. ఆమె అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు, శోభన, అనిల్ కామినేనిల కూతురు అని తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన బర్త్ డే సందర్భంగా RC15 టీమ్ గేమ్ ఛేంజర్ అనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే… ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో దర్శకుడు. నటుడు ఎస్ జే సూర్య నటించనున్నారట. దీనికి సంబంధించి టీమ్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ భారీ సినిమాలో చరణ్ సరసన హిందీ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ డిమాండ్ పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్‌ రైట్స్ కోసం 45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే… ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.. వీటితో పాటు రామ్ చరణ్, కేజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాను, విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కూడా ఓ సినిమాను చేయనున్నారు. వీటితో పాటు బుచ్చిబాబు సనాతో ఓ సినిమాను చేస్తున్నారు