‘చోరుడు’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సూపర్ స్టార్ ధనుష్

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత జి. డిల్లీబాబు యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై ‘చోరుడు’ అనే కొత్త చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జివి ప్రకాష్, ప్రముఖ దర్శకుడు భారతీరాజా, ఇవానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే దర్శకుడు బాలా ‘ఝాన్సీ’లో జివి ప్రకాష్, ఇవానా ఇద్దరూ స్క్రీన్‌ను పంచుకోవడం విశేషం. ‘చోరుడు’ అడ్వెంచర్, థ్రిల్లర్ మూమెంట్స్‌తో కూడిన కామెడీ డ్రామా.

పివి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రఫీని కూడా అందిస్తున్నారు. పివి శంకర్, రమేష్ అయ్యప్పన్‌ కలసి కథ & స్క్రీన్‌ప్లే అందించారు. అలాగే రాజేష్ కన్నాతో కలిసి ఇద్దరూ డైలాగ్స్ రాశారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ హీరో ధనుష్ ఈ రోజు విడుదల చేశారు. పోస్టర్‌లో ప్రధాన తారాగణం రస్టిక్ గెటప్‌లో కనిపిస్తుంది. ఓ భారీ ఏనుగు పాదం పై నిలబడి వున్న ప్రధాన తారాగణం, బ్యాక్‌డ్రాప్‌లోని చెట్లు చూస్తుంటే.. కథ అటవీ నేపథ్యంలో సెట్ చేయబడిందని తెలియజేస్తోంది. ఏనుగు పాదం కింద వున్న రూపాయి కాయిన్ కూడా ఫస్ట్ లుక్ లో గమనించవచ్చు. 2023 వేసవిలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

ధీనా, జి. జ్ఞానసంబందం, వినోద్ మున్నా, ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే మేకర్స్ ట్రైలర్, ఆడియో, సినిమా విడుదల తేదిలని తెలియజేస్తారు

తారాగణం: జివి ప్రకాష్, భారతీరాజా, ఇవానా, ధీనా, జి. జ్ఞానసంబందం, వినోద్ మున్నా తదితరులు

సాంకేతిక విభాగం
దర్శకత్వం, సినిమాటోగ్రఫీ : పివి శంకర్
నిర్మాత: జి డిల్లి బాబు
బ్యానర్: యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
ఎడిటింగ్: రేమండ్ డెరిక్ క్రాస్టా
టీజర్ కట్ – ఎడిటర్ శాన్ లోకేష్
ఆర్ట్ – ఎన్.కె. రాహుల్
స్టంట్ – దిలీప్ సుబ్బరాయన్
కథ – రమేష్ అయ్యప్పన్, పివి శంకర్
స్క్రీన్ ప్లే – పివి శంకర్ , రమేష్ అయ్యప్పన్
డైలాగ్స్- రమేష్ అయ్యప్పన్, రాజేష్ కన్నా, పివి శంకర్
అదనపు స్క్రీన్ ప్లే – SJ అర్జున్, శివకుమార్ మురుగేశన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – పూర్ణేష్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – ఎస్ ఎస్ శ్రీధర్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – కె.వి. దురై
లిరిక్స్ – స్నేకన్, ఏకాదేశి, మాయా మహ్లింగం, నవక్కరై నవీన్ ప్రబంజం
మేనేజర్ – అరంతై బాలా, మణి ధమోతరన్
కాస్ట్యూమ్ డిజైనర్ – కృష్ణ ప్రభు
స్టిల్స్ – ఇ.రాజేంద్రన్
కాస్ట్యూమర్ – సుబియర్
మేకప్ -వినోత్ సుకుమారన్
పీఆర్వో – వంశీ శేఖర్
మార్కెటింగ్ & ప్రమోషన్లు – డీఈసి
సౌండ్ డిజైన్ – సింక్ సినిమా
DI – Lixo Pixels
VFX సూపర్‌వైజర్ – కిరణ్ రాఘవన్ (Resol VFX)
పబ్లిసిటీ డిజైనర్ – విన్సీ రాజ్