‘దాస్ కా ధమ్కీ’ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ వీడియో సాంగ్ విడుదల

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ టైటిల్ రోల్ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించిన ‘దాస్ కా ధమ్కీ’ థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఫస్ట్ సింగిల్ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ లిరికల్ వీడియోకు భారీ స్పందన రావడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా బ్లాక్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. తాజాగా వీడియో సాంగ్‌ని విడుదల చేయడం ద్వారా మేకర్స్ ఫుల్ ఫీస్ట్‌ను అందించారు. లియోన్ జేమ్స్ లైవ్లీ బీట్‌లతో పెప్పీ నంబర్‌ని స్కోర్ చేశాడు. పాట కోసం ఫారిన్ లోకేషన్స్ లోషూట్ చేసిన స్టైలిష్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదిత్య ఆర్కేఎనర్జిటిక్ గా పాడగా, పూర్ణా చారి సాహిత్యం ఆకట్టుకుంది.

విశ్వక్ సేన్ స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌లతో మెస్మరైజ్ చేశాడు. నివేదా పేతురాజ్ ఈ బీచ్‌సైడ్ సాంగ్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చక్కగా ఉంది. పూర్తి వీడియో సాంగ్‌లోలీడ్ పెయిర్ అద్భుతమైన కెమిస్ట్రీతో ‘ఆల్ మోస్ట్ పడిపోయిందే’ చాలా ఆకర్షణీయంగా వుంది.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు.

ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం.

దాస్ కా ధమ్కీ ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్

సాంకేతిక విభాగం :
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: కరాటే రాజు
బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్
డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
డీవోపీ: దినేష్ కె బాబు
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: అన్వర్ అలీ
ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు
ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్
పీఆర్వో: వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్