డాన్‌ సీరిస్‌కు పెరుగుతున్న క్రేజ్‌!

బాలీవుడ్‌లో డాన్‌ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పదిహేడేళ్ల కిందట ఈ సిరీస్‌లో వచ్చిన తొలి పార్టు బాక్సాఫీస్‌ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా వంద కోట్ల మార్క్‌ను టచ్‌ చేసి హిందీనాట సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాదు అప్పట్లో ఈ సినిమాకైన బ్జడెట్‌ ఆక్షరాల రూ.38 కోట్లు. ఇక ఆ తర్వాత ఐదేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్‌ వచ్చింది. డాన్‌`2:ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ వచ్చిన ఈ సినిమా షారుఖ్‌ను రెండొందల కోట్ల క్లబ్‌లో చేర్చింది. ఈ రెండు సినిమాలకు ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వం వహించాడు.

ఇక తాజాగా ఈ సిరీస్‌లో మూడో ఇన్‌స్టాల్లేషన్‌గా డాన్‌`3ను సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ సారి డాన్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ను చూపించబోతున్నాడు. కొత్త శకం ప్రారంభం అంటూ ఓ స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేశాడు. అందులో రణ్‌వీర్‌ డాన్‌ మేకోవర్‌ను చూపించారు. లైటర్‌తో సిగర్‌ వెలిగించుకుంటూ డాన్‌ అని చెప్పడం గ్లింప్స్‌కే హైలేట్‌లా నిలిచింది. ఫర్హాన్‌ దాదాపు పుష్కర కాలం తర్వాత మెగా ఫోన్‌ పడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ స్టార్ట్‌ చేసి వచ్చే ఏడాది చివరి కల్లా షూటింగ్‌ను పూర్తి చేయనున్నారట. ఆపై పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు, ప్రమోషన్‌లు గట్రా ఎª`లాన్‌ చేసి 2025లో సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. రితేష్‌ సిద్వాని, ఫర్హన్‌ అక్తర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో రూపొందుతుంది.