చిరంజీవి మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్-టైమ్ ఇండస్ట్రీ రికార్డు

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విన్నర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మొదటి వారం మొత్తం అద్భుతమైన వసూళ్లను కొనసాగించడమే కాకుండా, బ్రేక్-ఈవెన్ సాధించడంతో సహా అనేక మైలురాళ్లను అధిగమించింది.

భారీ ఓపెనింగ్ తర్వాత, ఈ చిత్రం ప్రతిరోజూ పెద్ద మొత్తాలను వసూలు చేస్తూ, నిన్న ఒక్కరోజే 31 కోట్ల రూపాయలను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు ఇప్పుడు 292 కోట్లకు చేరుకున్నాయి, దీంతో ‘MSG’ ప్రతిష్టాత్మక 300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది, ఈ మైలురాయిని ఈ రోజు సులభంగా దాటుతుందని భావిస్తున్నారు.

ఈ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని అధిగమించి, అనిల్ రావిపూడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. ‘MSG’ తన 7వ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆల్-టైమ్ అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రంగా కూడా నిలిచింది.

‘మన శంకర వర ప్రసాద్ గారు’ అన్ని చోట్లా అద్భుతమైన ఆక్యుపెన్సీలతో రెండవ వారంలోకి ఎంటర్రైయింది.

విదేశాలలో కూడా ‘MSG’ అద్భుతంగా దూసుకుపోయింది. ఉత్తర అమెరికాలో, చిరంజీవి, అనిల్ రావిపూడి ఇద్దరి మునుపటి రికార్డులను బ్రేక్ చేస్తూ, $2.96 మిలియన్లకు పైగా వసూలు చేసి, $3 మిలియన్ల మైలురాయికి చేరువలో ఉంది, ఈ వేగంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి కెరీర్‌లో ఆల్-టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే దిశగా పయనిస్తోంది.

చిరంజీవి స్టార్ పవర్, వరుస బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో అనిల్ రావిపూడి మార్క్, పాజిటివ్ మౌత్ టాక్, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ‘MSG’ని సంక్రాంతి విజేతగా నిలబెట్టాయి.

మెగాస్టార్ ఆరా తో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు, అద్భుతమైన వినోదం కలిసిన ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంతటి పోటీ సీజన్ అయినా బాక్సాఫీస్‌ను శాసించగలదని మరోసారి నిరూపిస్తోంది.

రిపోర్టర్ Vs రేణుదేశాయ్ || Renu Desai Fires On Reporter || Renu Desai Vs Reporter || Telugu Rajyam