చిరంజీవి, వశిష్ట – మెగా157 పీప్రొడక్షన్ పనులు ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేక సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వశిష్ట దర్శకత్వంలో అనౌన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ #మెగా157 అభిమానుల మెగా సెలబ్రేషన్స్ ని రెట్టింపు చేసింది. పంచభూతాలతో కూడిన అనౌన్స్ మెంట్ పోస్టర్ సోషల్ మీడియా & ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టించింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ను యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఈరోజు చిత్ర దర్శకుడు వశిష్ట సినిమా ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ప్రారంభించినట్లు అనౌన్స్ చేశారు. ఛోటా కె నాయుడు ఈ చిత్రానికి డివోపీగా పని చేస్తారని కూడా ఆయన తెలియజేశారు.

“ మెగా ఫిల్మ్ కి మెగాస్టార్🌟. #మెగా157 ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించాం. త్వరలో మీ అందరినీ సినిమాటిక్ అడ్వంచర్ కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాము’’ అని ట్వీట్ చేసిన వశిష్ట.. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత, డీవోపి తో కలసివున్న ఫోటోని షేర్ చేశారు.

ఈ మెగా మాస్ బియాండ్ యూనివర్స్ ప్రాజెక్ట్ కు సంబధించిన ఇతర తారాగణం, టెక్నికల్ టీంను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి

సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్
డీవోపీ: ఛోటా కె నాయుడు