రంగురాళ్ల చుట్టూ తిరిగే ‘ఛాంగురే బంగారు రాజా’ హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు తీయడం అరుదు. ఒకవేళ తీసినా, వాటిలోనూ తామే హీరోలుగా ఉంటూ భాగస్వామ్యులు అవుతుంటారు. అలాంటిది రవితేజ నిర్మాణంలో తెరకెక్కిన ‘ఛాంగురే బంగారు రాజా’.
కార్తిక్ రత్నం హీరోగా నటించారు. ఈ గురించి కార్తిక్ రత్నం చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..’ఛాంగురే బంగారురాజా’ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కామెడీ, థ్రిల్, యాక్షన్ అన్నీ వుంటాయి. కుటుంబం అంతా కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయి చూడదగ్గ చిత్రం. చాలా నవ్విస్తుంది.
కొన్ని కొండ ప్రాంతాల్లో రంగురాళ్ళు దొరుకుతాయి. ఐతే అవి నిషిద్ద ప్రాంతాలు. కానీ కొందరు రిస్క్ చేసి అక్కడ రంగురాళ్ళ కోసం తవ్వకాలు చేస్తారు. కొనుక్కునే వాళ్ళు కూడా అక్కడికే వస్తారు. ఈ కథ బ్యాక్ డ్రాప్ కూడా ఆ నేపథ్యంలో వుంటుంది. ఇందులో ఓ నాలుగు గ్యాంగ్ లు వుంటాయి. దాదాపు అంతా గ్యాంగ్ ల ఛేజింగ్ వుంటుంది. ఆ వెంటపడటంలో కూడా కామెడీ వుంటుంది. నారప్ప చేస్తున్నప్పుడు..! నేను ‘నారప్ప’ చేస్తున్నపుడు సతీష్ ఆ చిత్రానికి అసోషియేట్ డైరెక్టర్ గా చేశారు. దాదాపు ఓ రెండు నెలలు పాటు క్లోజ్ గా ప్రయాణించాం. అప్పటివరకూ నేను అన్నీ సీరియస్ గా వుండే పాత్రలు చేశాను.
ఐతే ఈ ప్రయాణంలో నేను మంచి కామెడీ కూడా చేస్తానని, నా కామెడీ టైమింగ్ బావుందని సతీష్ కి నమ్మకం కుదిరింది. అప్పుడు ఈ కథ చెప్పారు. ఎలాగైనా చేయాలని అనుకున్నాం. నిర్మాతల కోసం తిరిగారు. ఒక రోజు సతీష్ ఫోన్ చేసి.. మన కథ ఓకే అయ్యింది. రవితేజ గారు నిర్మిస్తున్నారని చెప్పారు.
మొదట రవితేజ గారు అంటే ఏ నిర్మాతో అనుకున్నాను. కానీ మాస్ మహారాజా రవితేజ గారని తెలిసి చాలా ఎక్సయిట్ అయ్యాను. ఐతే రవితేజ గారు లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుందంటే అందులో నేను హీరోగా వుండనేమో అని కూడా అనుకున్నాను. ‘నువ్వే హీరో’’ అని సతీష్ చెప్పిన తర్వాత నా ఆనందానికి హద్దులు లేవు. ఆ రోజు నేను, సతీష్ హైదరాబాద్ అంతా చుట్టేశాం. పెద్ద వంశీ తో పోలిక! ఛాంగురే బంగారు రాజాలో పెద్ద వంశీ ల్లోని కథల ఫ్లేవర్ కనిపిస్తుంది.
హీరో, విలన్ అని కాకుండా ప్రతి పాత్రకూ పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ వుంటాయి. రవిబాబు గారు, సత్యతో మిగతా పాత్రలన్నీ చాలా హిలేరియస్ గా వుంటాయి. రవిబాబు గారు అద్భుతమైన టైమింగ్ యాక్టర్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ఇంతకుముందు చేసిన సీరియస్ పాత్రలలో మాడ్యులేషన్, డైలాగ్, లుక్, వాయిస్ ఇవన్నీ ఆ పాత్రలకు తగ్గట్టుగా వుండాల్సివచ్చింది. ఇందులో మాత్రం నేను సహజంగా ఎలా ఉంటానో అలా వుంటే చాలన్నారు. ఇది నాకు చాలా ఈజీ అనిపించింది.
కామెడీ చేయడం చాలా కష్టం అంటారు. కానీ రైటింగ్ బావుంటే ఈజీగా చేయొచ్చనిపించింది.రవితేజకు నచ్చింది! నేను నటుడు కావడానికి స్ఫూర్తి రవితేజ గారు. ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలు అనుకున్నాను. అలాంటిది ఆయన నిర్మాణంలోనే చేయడం మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి.