సునీల్ ‘భువన విజయమ్’ ఫస్ట్ లుక్ లాంచ్ – డైరెక్టర్ వేణు ఉడుగుల

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వం. హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న కామెడీ డ్రామా ‘భువన విజయమ్’.

వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్ లో ప్రధాన తారాగణం సునీల్ , శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ మిగతా నటులు సీరియస్ లుక్ లో కనిపించడం క్యూరీయాసిటీని పెంచింది.

శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం.

శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

తారాగణం: సునీల్ ,శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ , వైవా హర్ష , బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ , గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ ,సోనియా చౌదరి, స్నేహల్ కామత్ , షేకింగ్ శేషు, సత్తిపండు తదితరులు

టెక్నికల్ టీం :
రచన, దర్శకత్వం: యలమంద చరణ్
బ్యానర్స్ : హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా
నిర్మాతలు: కిరణ్, విఎస్కే
సమర్పణ: శ్రీమతి లక్ష్మి
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: సాయి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
పీఆర్వో : తేజస్వి సజ్జ