‘భోళా శంకర్’ నుంచి మహాశివరాత్రి సందర్భంగా మోషన్ పోస్టర్‌ విడుదల

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ల మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

మోషన్ పోస్టర్ లో చిరంజీవి ఫెరోషియస్ గా కనిపించారు. చేతిలో చేతిలో డమరుని పట్టుకుని నటరాజ నాట్యం చేస్తున్నట్లు కనిపించారు. శివుడు శివతాండవం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మహతి స్వర సాగర్ పోస్టర్‌కి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత ఇంటెన్సిటీ తెచ్చారు. ఈ పోస్టర్ మహా శివరాత్రి సందర్భానికి తగినట్లు ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో డాజ్లింగ్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది.

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.

సాంకేతిక వర్గం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్