యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జీరో టాలరెన్స్ ట్యాగ్ లైన్.
‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు..
ట్రైలర్‌ను గమనిస్తే… ‘ఊరారా ఇది.. చదువుకు తగ్గ జాబ్ లేదు.. జాబ్‌కు తగ్గ జీతం లేదు..కట్టిన ట్యాక్స్ తగ్గినట్లు సౌకర్యాలు లేవు..దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉన్నాడు, తప్పు చేస్తున్నవాడు తప్పు చేస్తూనే ఉంటాడు’’ అని ఓ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. మరో వైపు హీరో సిద్ధార్థ్ ‘మనం ఒక్కొక్కరినీ తప్పు పడుతూనే ఉంటాం. సిస్టమ్ సరిగా లేదు. సరి చేయాలని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటాం. కానీ దాన్ని సరి చేయటానికి కొంచెం కూడా ప్రయత్నించటం లేదు’ తన బాధను వ్యక్తం చేస్తాడు.
కొంత మంది యువత రోడ్ల పైకి వచ్చి పోరాటం చేస్తుంటే పోలీసులు వారిపై కాల్పులు జరుపుతారు. మనం మొరిగే కుక్కలం మాత్రమే.. అందుకే అరుస్తున్నా అని అందులో ఓ యువకుడు తన ఆక్రోశాన్ని వెల్లగక్కుతాడు. ఇలా దేశమంతా అల్లర్లతో అట్టుడికి పోతుంటుంది. ఆ సమయంలో వీరందరినీ చీల్చి చెండాడే ఓ వేట కుక్క రావాలి అని సిద్ధార్థ్ అంటాడు. అలా ఎవరుంటార్రా అని ప్రియా భవానీ శంకర్ అంటే ఉండేవారు అని సిద్ధార్థ్ సమాధానం చెబుతాడు. ఆయనే మళ్లీ రావాలి. ఓ తప్పు చేస్తే దాన్నుంచి తప్పించుకోలేమనే భయం రావాలి అంటూ సిద్ధార్థ్ చెబుతాడు. అప్పుడు సేనాపతి (కమల్ హాసన్)ని చూపించారు. పార్ట్ వన్ భారతీయుడులో ఆయనేం చేశాడనే దాన్ని సింపుల్‌గా చూపించారు.
సేనాపతి తనొక ఫ్రీడమ్ ఫైటర్‌గా తన గురించి చెబుతూ ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను అనే పవర్‌ఫుల్, ఎమోషనల్ డైలాగ్స్ ‘భారతీయుడు 2’ ట్రైలర్‌లో ఉన్నాయి. ఇక ట్రైలర్‌లో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ యాక్షన్ సన్నివేశాలు, వాటిని అత్యద్భుతంగా తెరకెక్కించిన శంకర్ మేకింగ్ స్టైల్ నెక్ట్స్ రేంజ్‌లో ఉన్నాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తిని ట్రైలర్ రేకెత్తిస్తోంది.
‘భారతీయుడు 2’ ట్రైలర్‌లో సేనాపతి పాత్రతో పాటు డిఫరెంట్ లుక్స్‌లో కమల్ హాసన్ తనదైన అభినయాన్ని ప్రదర్శించారు. ఇక మర్మకళతో విలన్స్ భరతం పట్టడాన్ని కూడా ఈ సినిమాలో మరింత విస్తృతంగా చూపించినట్లు స్పష్టమవుతుంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ, అనిరుద్ సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాలను మరో లెవల్‌లో ఆవిష్కరించాయి. దీంతో సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.
కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేస్తున్నారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ కలయిక ప్రేక్షకులకు తిరుగులేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందనటంలో సందేహం లేదని ట్రైలర్‌తో స్పష్టమైంది.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్‌తో ‘భారతీయుడు 2’ సినిమా ప్రపంచంలో ఓ సరికొత్త మైలురాయిని క్రియేట్ చేయటానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్షకుల్లో గొప్ప ఆలోచన రేకెత్తించేలా సినిమాలు చేస్తూ తన అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ జూలై 12న ఇండియన్ 2 పేరుతో తమిళంలో, భారతీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, పియుష్ మిశ్రా, గురు సోమసుందరం, డిల్లీ గణేష్, జయప్రకాష్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ తదితరులు
సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: ఎస్.శంకర్, స్క్రీన్ ప్లే: ఎస్.శంకర్, బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్, మ్యూజిక్ : అనిరుద్ రవిచంద్రన్, ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రవివర్మన్, ఆర్ట్: ముత్తురాజ్, స్టంట్స్: అనల్ అరసు, అన్బరివు, రంజాన్ బులట్, పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ, డైలాగ్ రైటర్: హనుమాన్ చౌదరి, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: వి.శ్రీనివాస్ మోహన్, కొరియోగ్రఫీ: బాస్కో సీజర్, బాబా భాస్కర్, పాటలు: శ్రీమణి, సౌండ్ డిజైనర్: కునాల్ రాజన్, మేకప్ : లెగసీ ఎఫెక్ట్-వాన్స్ హర్ట్‌వెల్- పట్టణం రషీద్, కాస్టూమ్ డిజైన్: రాకీ-గవిన్ మ్యూగైల్- అమృతా రామ్-ఎస్‌బి సతీషన్-పల్లవి సింగ్-వి.సాయి, పబ్లిసిటీ డిజైనర్: కబిలన్ చెల్లయ్య ,పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుందర్ రాజ్, హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్, రెడ్ జైంట్ మూవీస్: సెన్‌బగ మూర్తి, నిర్మాత: సుభాస్కరన్.