“దక్ష ” సినిమా టీం కి శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరో గా చేస్తున్న సినిమా ” దక్ష “. తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా, వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకి సిద్దంగా ఉంది.

ఈ సందర్భంగా హీరోయిన్ నక్షత్ర , బాలయ్య నూతన సినిమా “భగవంత్ కేసరి” లొకేషన్ లో కలిసి, బాలయ్య ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా బాలక్రిష్ణ దక్ష టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ బాలకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి, సున్నితమైన మనసు గల వ్యక్తి, మా దక్ష సినిమా కి విషెస్ తెలిపారు, అలానే భోజనం కూడా కలిసి చేసాం, తన అనుభవం మా లాంటి యువత కి మార్గదర్శనియం.

ఈ సినిమా కి కో ప్రొడ్యూసర్-తల్లాడ సాయికృష్ణ ,
సంగీతం – లలిత్
నటి నటులు – ఆయుష్, అను, నక్షత్ర, రవి రెడ్డి, అఖిల్, శోభన్ బాబు .