TATA IPL 2023ని మ‌రింత వినోదాత్మ‌కంగా అందించేందుకు బాలకృష్ణ

హైద‌రాబాద్‌, మార్చ్ 26, 2023: TATA IPL 2023ని టెలివిజ‌న్‌లో ప్ర‌సారం చేసేందుకు స‌ర్వ‌హ‌క్కులు క‌లిగిన స్టార్ స్పోర్ట్స్. కోట్లాది క్రికెట్ అభిమానులకు సాటిలేని, మ‌రిచిపోలేని వినోదాన్ని అందించేందుకు సూపర్ స్టార్ నందమూరి బాలక్రిష్ణతో భాగస్వామ్యం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వంటి కీలక మార్కెట్లలో క్రికెట్‌ను మ‌రింత‌గా జ‌నాల్లోకి తీసుకోళ్ల‌టంతో పాటు..క్రీడ‌ల ప‌ట్ల ప్ర‌జాద‌ర‌ణ‌ పెంచుకోవడానికి స్టార్ స్పోర్ట్స్ చేస్తున్న నిరంతర ప్రయత్నంలో ఈ అసొయేష‌న్‌ ఒక భాగం. దాదాపు 50 ఏళ్ల త‌న‌ సినీ ప్ర‌స్థానం ఉన్న బాల‌కృష్ణగారికి క్రికెట్ అంటే అభిమానం. కాలేజీ రోజుల్లో ఇండియా మాజీ కెప్టెన్ మొహ‌మ్మ‌ద్ అజారుద్దీన్ తో క‌లిసి క్రికెట్ ఆడారు. అలాగే సెల‌బ్రిటీ లీగ్‌లో క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు..షూటింగ్ స‌మ‌యాల్లో కూడా సెట్స్‌లో క్రికెట్ ఆడుతూ ఇప్ప‌టికీ క్రికెట్ అంటే మ‌న మ‌క్కువ‌ను చాటుకుంటునే ఉన్నారు.

2019లో ప్రారంభ‌మైన నాటి నుంచి స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో స్పోర్ట్స్‌కు నెంబ‌ర్ 1 గమ్య‌స్థానంగా నిలిచింది. భారతీయ మాజీ క్రికెటర్లు – వేణుగోపాల్ రావు (IPL టైటిల్ విజేత), MSK ప్రసాద్ (మాజీ చీఫ్ సెలెక్టర్), ఆల్‌టైం గ్రేటెస్ట్ క్రికెట‌ర్ల‌లో ఒక‌రైన మిథాలీ రాజ్ వంటి గొప్ప ప్యానెల్ ఉన్న స్టార్ స్పోర్ట్స్ తెలుగుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 85% వీక్ష‌కులు ఉన్నారు. తెలుగులో క్రికెట్ ప్ర‌సారాల‌కు గ‌త 6 నెల‌లుగా విశేష పురోగ‌తి క‌నిపిస్తోంది. గ‌త జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి మాసాల్లో ఇండియా ఆడిన T20I ద్వైపాక్షిక సిరీస్‌ల‌ను టీవీల్లో చూసే వారి సంఖ్య‌ 20% పెరిగింది. ఈ పెరుగుద‌ల SS1 తెలుగు HD ఛానెల్‌ను ప్రారంభించేందుకు స్టార్ స్పోర్ట్స్‌కు ఊత‌మిచ్చింది. తెలుగు ప్రేక్ష‌కుల సంస్కృతిని ప్ర‌తిబింబించేలా అత్యుత్త‌మ నాణ్య‌త‌తో క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేసేందుకు ప్రేరేపించింది.

క్రీడ‌ల‌ను, వినోదాన్ని మిక్స్ చేసి “ఇన్‌క్రెడిబుల్ యాక్ష‌న్‌..ఆట అన్‌స్టాబెబుల్” ద్వారా స్టార్‌స్పోర్ట్స్ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త స్థాయిలో వినోదాన్ని అందించ‌నున్నారు. క్రికెట్ అభిమానులు నిస్సందేహంగా ఈ IPL సీజ‌న్‌లో మునుపెన్న‌డూ లేని స్థాయిలో వినోదాన్ని ఆశించొచ్చు. ఎందుకంటే వేణుగోపాల్ రావు, MSK ప్ర‌సాద్‌తో పాటు బాల‌కృష్ణ‌గారు కామెంట‌రీ బాక్స్‌ను షేర్ చేసుకోబోతున్నారు. ఆయ‌న త‌న అస‌మాన శైలితో ఆట‌పై క్రీడాభిమానుల దృక్ప‌థానికి త‌గిన‌ట్లుగా ఉత్సాహ‌భ‌రితంగా కామెంట‌రీ అందించ‌నున్నారు. అంతేకాదు..#AskStar ద్వారా అభిమానులు తొలిసారిగా నేరుగా TV లైవ్‌లో పాల్గొనే గొప్ప అవ‌కాశం అందిస్తున్నాం. ఇండియాలో అత్య‌ధికంగా విక్షిస్తున్న క్రికెట్ షో – క్రికెట్ లైవ్‌లో కూడా బాల‌కృష్ణ‌గారు క‌నిపించ‌బోతున్నారు.

Link to watch Nandamuri Balakrishna playing cricket on sets of Star Sports Telugu – Twitter

స్టార్‌స్పోర్ట్స్ తెలుగుతో అసొసియేట్ అవ‌టంపై నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ ” లీడింగ్ స్పోర్ట్స్‌ బ్రాడ్‌కాస్ట‌ర్‌లో భాగ‌మైన‌ స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో అసొసియేట్‌ అవుతున్నందుకు ఓ క్రికెట్ అభిమానిగా సంతోషిస్తున్నాను. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి బిగ్ స్క్రీన్‌పై IPL చూస్తూ సంతోషంగా గ‌డిపిన క్ష‌ణాలు ఎన్నో ఉన్నాయి. ఇక తెలుగు అభిమానులు న‌న్ను స్టార్ స్పోర్ట్స్‌లో చూడొచ్చు. మార్చ్ 31న‌ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఎక్స్‌పర్ట్స్‌తో జాయిన్ కాబోతున్నా. ఆ క్ష‌ణం కోసం నేను ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నా. మ‌న క్రికెట్ స్టార్స్ అందిరికీ నేను మ‌ద్ద‌తు ఇస్తున్నాను, అలాగే ఈ సీజ‌న్ మ‌నంద‌రికీ ప్ర‌త్యేకంగా నిలిచిపోవాల‌ని ఆశిస్తున్నాను. “

భాల‌కృష్ణ‌తో అసొసియేట్ అవ‌టంపై స్టార్ స్పోర్ట్స్ ప్ర‌తినిధి మాట్లాడుతూ “ఐకానిక్ స్టార్ నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అసొసియేట్ అవ‌టం ఆనందంగా ఉంది. మా ప్రేక్ష‌కుల‌కు అత్యుత్త‌మ వీక్ష‌ణ అనుభూతిని అందించేందుకు క‌ట్టుబ‌డి ఉన్నాం. అందుకోసం ఎగ్జైటింగ్ అసొసియేష‌న్‌తో ప్ర‌సారాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఉన్న‌తంగా అందిస్తుంటాం. అత్యంత ప్ర‌జాద‌ర‌ణ, క్రీడాభిమానిగా అలాగే టాక్ షో హోస్ట్‌గా విశేష అనుభ‌వం ఉన్న బాల‌కృష్ణ‌గారు, IPL ప్ర‌సారాల‌ను “ఇన్‌క్రెడిబుల్” స్థాయిలో అందించాల‌నే మా ల‌క్ష్యానికి స‌రైన వ్య‌క్తి. టాక్ షోకు హోస్ట్‌గా అత‌ను ఎంత‌ అద్భుతంగా వ్య‌వ‌హ‌రించారో మ‌న‌కు తెలిసిన విష‌య‌మే. స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ బాక్స్, స్టూడియోకి కూడా అదే స్థాయి చరిష్మా తీసుకురాగ‌ల‌ర‌ని నిస్సంకోచ‌కంగా విశ్వ‌సిస్తున్నాం. బాల‌కృష్ణ‌గారి విభిన్న కోణాన్ని స్టార్ స్పోర్ట్స్ తెలుగులో వీక్షించేందుకు తెలుగు అభిమానులు ఆతృత‌గా ఎదురుచూస్తున్నార‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌లం”.

ఇదిలా ఉండ‌గా సూపర్ స్టార్స్ లైన‌ప్‌తో కూడిన‌ స్టార్ స్పోర్ట్స్ క్యాంపేన్ ‘షోర్ ఆన్, గేమ్ ఆన్’ ఇప్పటికే సోషల్ మీడియాలో తుఫాను సృష్టించింది. కుటుంబ‌స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి బిగ్ స్క్రీన్‌పై మ్యాచ్‌ల‌ను అస్వాదించాలంటూ కింగ్ కోహ్లీ ఈ ప్రోమోలో పిలుపునిస్తూ కింగ్ కోహ్లీతో చేసిన ప్రోమో ‘హర్ ఘర్ బనేగా స్టేడియం’ ఇప్ప‌టికే వైర‌ల్‌గా మారింది. ఇండియ‌న్ క్రికెట్ టీమ్ మాజీ చీఫ్ సెల‌క్ట‌ర్ MSK ప్ర‌సాద్‌, ఇండియా మాజీ కెప్టెన్ మిథాలి రాజ్‌, IPL ఛాంపియ‌న్స్ వేణుగోపాల్ రావు, T సుమ‌న్‌, ఆశిష్ రెడ్డి, క‌ళ్యాణ్ కృష్ణ వంటి బెస్ట్ ఎక్స్‌ప‌ర్ట్స్ క‌లిగిన కామెంట‌రీ ప్యానెల్‌ అభిమానుల‌కు మ‌రింత ఉత్స‌హం క‌లిగించేలా తెలుగు కామెంట‌రీ అందించ‌నున్నారు.

TATA IPL 2023 యాక్ష‌న్‌ను టెలివిజ‌న్‌లో అస్వాదించండి మార్చ్ 31 – 28, 2023 వ‌ర‌కు, స్టార్ స్పోర్ట్స్ తెలుగు