తన తొలి చిత్రం ‘హీరో’తో ఆకట్టుకున్న సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, తన రెండవ సినిమా #AshokGalla2 ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ హను మాన్ ఫేం ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.
మేకర్స్ ఈరోజు సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. #AshokGalla2కు ‘దేవకీ నందన వాసుదేవ’ అనే ఆకట్టుకునే అనే టైటిల్ పెట్టారు. కథానాయకుడి పాత్రతో పాటు సినిమా ప్రిమైజ్ కూడా పరిచయం చేసేలా టీజర్ ఉంది. “నీ బిడ్డకి మరణ గండం…లేదా అతని చేతిలో మరొకరికి మరణం…” అని వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. బురదలో రౌడీలతో జరిగే ఫైట్ సీక్వెన్స్ తో హీరో యాక్షన్-ప్యాక్డ్ ఎంట్రీ కట్టిపడేసింది. హీరో ప్రేమికురాలుగా వారణాసి మానస ఎంట్రీ ప్లజెంట్ గా వుంది.
“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… యుగమేదైనా… ఏ కలంలోనైనా… ఈ భూమిమీద దేవుడి కంటే రాక్షసుడే ముందు పుడతాడు… వాన్నీ చంపడానికై దేవుడూ పుడతాడు” అనే డైలాగ్ కథానాయకుడి పుట్టుక యొక్క లక్ష్యాన్ని సూచిస్తుంది. డైలాగ్స్, విజువల్ ప్రెజెంటేషన్, బ్యాక్ గ్రౌండ్ శ్లోకంలో శ్రీకృష్ణుని రిఫరెన్స్ లు కనిపించడం చాలా ఆసక్తికరంగా వుంది.
అశోక్ గల్లాకి ఇది కంప్లీట్ మేకోవర్. తన తొలి చిత్రంలో స్టైలిష్ , క్లాస్ లుక్‌లో కనిపించిన ఈ యంగ్ స్టర్ ఇందులో మీసాలు, గడ్డంతో మాస్ అవతార్‌లో కనిపించాడు. అశోక్ గల్లా పవర్ ప్యాక్ క్యారెక్టర్‌లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వారణాసి మానస అందంగా కనిపించింది. ప్రసాద్ మూరెళ్ల బ్రైట్ ఫ్రేమ్‌లు, భీమ్స్ సిసిరోలియో ప్లజంట్ స్కోర్ మరింత ఆకర్షణగా నిలిచాయి సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. టీజర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్స్ తో మాస్ ని ఆకట్టుకుంటుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో అశోక్ గల్లా మాట్లాడుతూ.. టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా వుంది. ఎన్నో పెద్ద సినిమాలకు మాటలు రాసిన సాయి మాధవ్ గారు మా సినిమాకి పని చేయడం చాలా సంతోషంగా వుంది. మూడు నాలుగు సినిమాల తర్వాత ఇంత మాస్ సినిమా చేయాలని అనుకున్నాను. కానీ బాల గారు నన్ను ఇలా ప్రజెంట్ చేసే అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని భావిస్తున్నాను. ప్రశాంత్ వర్మ గారు అద్భుతమైన కథ ఇచ్చారు. అర్జున్ గారు కథని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. మానస చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా నుంచి రాబోతున్న మిగతా కంటెంట్ కూడా మిమ్మల్ని అలరిస్తుంది. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు
మానస వారణాసి మాట్లాడుతూ.. అర్జున్ గారు ఈ కథ చెప్పినప్పుడు అద్భుతంగా అనిపించింది. ప్రశాంత్ గారికి, బాల గారికి అందరికీ ధన్యవాలు. అశోక్ వండర్ ఫుల్ కో స్టార్. షూటింగ్ చాలా సరదాగా జరిగింది. ఇది నా మొదటి సినిమా. అందరూ చాలా సపోర్ట్ చేశారు. అందరినుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ.. నిర్మాత బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ప్రశాంత్ వర్మ గారు నన్ను నమ్మి చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఈ కథ ఇచ్చారు. అవుట్ పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు, నన్ను ఇంత బలంగా నమ్మినందుకు ప్రశాంత్ గారికి థాంక్స్. సాయి మాధవ్ బుర్రా గారు సినిమాకి అద్భుతంగా మాటలు రాశారు. బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ పెద్ద హిట్ అవుతుంది. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా ఇంత బాగా రావడానికి కారణం అశోక్ గారు. చాలా కోపరేట్ చేశారు. మానస తన పాత్రని అద్భుతంగా చేసింది. ఇది చాలా కొత్త సినిమా. అన్ని కమర్షియల్ విలువలు వుండే సినిమా. మురారి తరహ సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.’ అన్నారు
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నేను రాసిన కథల్లో మోస్ట్ ఎంటర్ టైనింగ్ స్టొరీ ఇది. దాదాపు రెండేళ్ళు కథపై వర్క్ చేశాను. ఈ కథపై అశోక్ పేరు రాసుంది. బాలకృష్ణ గారు చాలా ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చారు. అర్జున్ గారు ఈ కథని నాకంటే బాగా తీయగలుగుతారనే నమ్మకం కలిగింది. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ గారు మాటలు రాయడం ఆనందంగా వుంది. అద్భుతంగా రాశారు. బీమ్స్ గారు మంచి పాటలు ఇచ్చారు. ఇందులో కంసరాజు పాత్రని దేవ్ దత్త గారు చాలా అద్భుతంగా చేశారు. మానస చాలా కీలక పాత్రని పోషించారు. ఇది చాలా మాస్ ఫిల్మ్. అశోక్ క్లాస్ గా వుంటాడు. ఇంత మాస్ పాత్రని తను ఎలా చేస్తాడో అనుకున్నాను. కానీ చాలా సర్ ప్రైజ్ ఇచ్చాడు. టీజర్ చూసినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. ‘దేవకీ నందన వాసుదేవ’.. టైటిల్ లో అర్జున్ గారి అభిరుచి కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు
సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. చాలా మంచి సినిమాకి పని చేశాననే తృప్తి వుంది. బాలా స్టార్ ప్రొడ్యుసర్ అవుతరానే నమ్మకం వుంది. ప్రశాంత్ వర్మ తన కథని అర్జున్ చేతిలో పెట్టడం అర్జున్ పై తనకి వున్న నమ్మకాని అద్దం పడుతుంది. కృష్ణ గారి కుటుంబం నుంచి వచ్చిన అశోక్ బాబు తప్పకుండా సూపర్ స్టార్ అవుతాడు. ఈ సినిమాకి అందరూ ప్రాణంపెట్టి పనిచేశారు’ అన్నారు.
నిర్మాత సోమినేని బాలకృష్ణ మాట్లాడుతూ.. నా కుటుంబం, ప్రశాంత్ వర్మ గారు, అశోక్ గారి సపోర్ట్ ఉండబట్టే ఈ చిత్రాన్ని ఇంత భారీ బడ్జెట్ తో తీయగలిగాను. ఇది విజువల్ వండర్ గా వుంటుంది. ఈ సినిమా విజయం సాధించి మంచి డబ్బులు వస్తే ఆ డబ్బులని మళ్ళీ సినిమా పరిశ్రమలోనే పెడతాను. సినిమా అంటే నాకు అంత ఇష్టం’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస
సాంకేతిక విభాగం :
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో : వంశీ-శేఖర్