విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి ‘ఏదో ఏదో కలవరం’ అనే పాటను భీమ్స్ సిసిరోలియో చేతుల మీదుగా విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న సినిమాలోని ఈ పాటను చైతన్య వర్మ రాశారు. అనురాగ్ కులకర్ణి, దీప్తి ప్రశాంతి పాటను ఆలపించారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో…
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ ‘‘చైతన్ భరద్వాజ్ నాకెంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. ఓ రకంగా చెప్పాలంటే నన్నెంతో భయపెట్టిన వ్యక్తి. ఇతనేంట్రా ఇలా చేస్తున్నాడు. మన పరిస్థితేంటి? అని చాలా సార్లు అనుకున్నాను. పిల్లా రా.., చుక్కల చున్నీ.., బుజ్జీ బంగారం.., అంతే గొప్పగా ఈ పాట ఉంది. అనురాగ్ కులకర్ణి వంటి సింగర్ ఉండటం మన ఇండస్ట్రీకి అదృష్టం. సాంగ్‌లో మంచి లిరిక్స్ ఉన్నాయి. హీరో విజయ్ ధరణ్ పాటలో వేసిన డాన్స్ చూస్తుంటే ఆవారా సినిమాలో కార్తి వేసిన స్టెప్స్ గుర్తుకు వచ్చాయి. నిర్మాత గణపతి రెడ్డిగారు ఖతర్ నుంచి ఇక్కడకు వచ్చి సినిమాలను నిర్మించారు. ఆయన మరిన్ని మంచి సినిమాలను నిర్మించాలని కోరుకుంటున్నాను. ఇదే సందర్భంలో ఇండస్ట్రీలోని ప్రతీ నిర్మాత, టెక్నీషియన్‌కి ధన్యవాదాలు. వి.జె.ఖన్నా డైరెక్ట్ చేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘‘ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ మా కోసం ఇక్కడకు వచ్చిన భీమ్స్ గారికి థాంక్స్. ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు. డైరెక్టర్‌గారు, హీరోగారు నా దగ్గరకు వచ్చి కథను డిస్కస్ చేసినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. నమ్మకంతో అవకాశం ఇచ్చారు. చాలా మంచి సినిమాకు పని చేశాననే సంతృప్తి కలిగింది. నిర్మాత గణపతి రెడ్డిగారు చాలా ప్యాషనేట్ వ్యక్తి. మంచి టీమ్ కుదిరింది. వారి సపోర్ట్‌తో మంచి మ్యూజిక్ అందిస్తున్నాను. లిరిక్ రైటర్, సింగర్స్‌కి థాంక్స్’’ అన్నారు.
దర్శకుడు వి.జె.ఖన్నా మాట్లాడుతూ ‘‘మా అన్వేషి సినిమా కథపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాత గణపతి రెడ్డిగారికి థాంక్స్. అలాగే సహ నిర్మాతలు అందరూ నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు. హీరో విజయ్ ధరణ్, సిమ్రాన్ గుప్తాలు చక్కగా నటించారు. అనన్య నాగళ్ల ఈ సినిమాలో కీ పాత్రలో నటించారు. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంటుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే సినిమా. చైతన్ భరద్వాజ్ ఎంత ఎఫర్ట్ పెట్టారో నాకు తెలుసు. ఈ జర్నీలో నాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
హీరో విజయ్ ధరణ్ దాట్ల మాట్లాడుతూ ‘‘ఒక థియేటర్ యాక్టర్‌గా స్టార్ అయ్యి చిన్న చిన్న కంటెంట్ చేసుకుంటూ వస్తున్న నాకు ఇంత మంచి అవకాశం రావటం అదృష్టం. ఓ మంచి కంటెంట్‌ను నమ్మిన నిర్మాతగారు సినిమా చేయటానికి ముందుకు వచ్చారు. ఇదొక టీమ్ వర్క్. సినిమా చూడటమే మా ఇంట్లో పెద్ద తప్పు. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన నేను యాక్టర్ అవుదామని ట్రావెల్ అవుతూ ఇక్కడకు వచ్చి నాకున్న పరిచయాలతో హీరోగా మారాను. మంచి టీమ్ కుదిరింది. మంచి ఔట్‌పుట్ వచ్చింది. డైరెక్టర్ ఖన్నాగారు కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మొదటి రోజు ఏ ఎనర్జీతో స్టార్ట్ చేశామో ఇంకా అదే ఎనర్జీతో కంటిన్యూ అవుతున్నాం. మా నిర్మాతలు గణపతి రెడ్డిగారు, సుబ్బరావుగారు, కో ప్రొడ్యూసర్స్ కిరణ్‌గారు, హరీష్‌గారు, భీమవరం రాంబాబుగారు, కిరణ్ గారి సపోర్ట్ మరచిపోలేం. చైతన్ భరద్వాజ్ మంచి స్నేహితుడు. కథలో నుంచి మోటివేట్ అయ్యి ఆయన అందించే సంగీతం నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఆయనింకా మంచి సంగీతం అందించాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరకటం మా అదృష్టం. ప్రేమ్ రక్షిత్ గారు మా సినిమాకు కొరియోగ్రఫీ చేశారు. ఆయన డేడికేషన్ చూస్తే ఆయనకు ఆస్కార్ ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. ఆయనతో కలిసి పని చేయటం నా అదృష్టం చైతన్య వర్మగారు చక్కటి లిరిక్స్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి, దీప్తిగారు ఎక్సలెంట్‌గా పాడారు. మా సాంగ్‌ను రిలీజ్ చేసిన భీమ్స్ గారికి థాంక్స్’’ అన్నారు.
జబర్దస్త్ నాగి మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్‌గారికి థాంక్స్. నిర్మాత గణపతి రెడ్డిగారికి, కిరణ్‌గారికి, సుబ్బారావుగారు సహా అందరికీ థాంక్స్. అన్వేషి చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘మల్లిక్‌గారు చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు. ఆయన వల్లే ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరుగుతుంది. నిర్మాతగా అన్వేషి నా తొలి చిత్రం. మా డైరెక్టర్ వి.జె.ఖన్నా మంచి కథ, స్క్రీన్‌ప్లేతో మంచి సినిమా చేశారు. షూటింగ్ అంతా పూర్తయ్యింది. మే రెండో వారంలో రిలీజ్‌కి ప్లాన్ చేశాం. హీరో విజయ్, హీరోయిన్ సిమ్రాన్ అద్భుతంగా నటించారు. చైతన్ భరద్వాజ్‌గారు అద్భుతమైన పాటను ఇచ్చారు. అలాగే ఆస్కార్ విన్నర్ ప్రేమ్ రక్షిత్‌గారు చక్కటి డాన్స్‌ను కంపోజ్ చేశారు. వారికి నా ధన్యవాదాలు. నాగి ఫుల్ లెంగ్త్ రోల్‌లో నవ్విస్తాడు. మా బ్యానర్‌కు అన్వేషి మంచి హిట్ అయ్యి మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది. చైతన్ భరద్వాజ్‌గారు మ్యూజిక్ చేసిన ‘పిల్లా రా..’ సాంగ్ కంటే మా ‘ఏదో ఏదో కలవరం’ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.
నటీనటులు: విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల, అజయ్ ఘోష్, నాగి, ప్రభు దిల్ రమేష్, చంద్ర శేఖర్ రెడ్డి, రచ్చ రవి, మిమిక్రీ సుబ్బరావు, ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ సత్య తదితరులు.
టెక్నీషియన్స్:
బ్యానర్: అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్, నిర్మాత: టి.గణపతి రెడ్డి, కో ప్రొడ్యూసర్స్: హరీష్ రాజు, శివన్ కుమార్ కందుల, గొల్ల వెంకట రాంబాబు, జాన్ బోయలపల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దుర్గేష్.ఎ, రచన, దర్శకత్వం: వి.జె.ఖన్నా, సినిమాటోగ్రఫీ: కె.కె.రావు, మ్యూజిక్: చైతన్ భరద్వాజ్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, లిరిక్స్: చైతన్య ప్రసాద్, చైతన్య వర్మ, శుభం విశ్వనాథ్, స్టంట్స్: జాషువా, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, విద్యాసాగర్ రాజు, పి.ఆర్.ఓ: వంశీ కాకా.