బ్లాక్ బ‌స్ట‌ర్ ‘జవాన్’ స‌క్సెస్ మీట్‌లో పెర్ఫామెన్స్‌తో అనిరుద్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘జవాన్’. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బిగ్ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ స‌రికొత్త రికార్డుల దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలో ‘జవాన్’ టీమ్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌లో చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు, మీడియా ప్ర‌తినిధులుపాల్గొన్నారు.

ముంబైలో ‘జవాన్’ స‌క్సెస్ మీట్ చాలా ఘ‌నంగా జ‌రిగింది. సినిమాలో పాట‌ల‌కు అద్భుత‌మైన పెర్ఫామెన్స్‌లు చేశారు. ఈ సినిమాకు ఎవ‌రైతే సంగీతం, నేప‌థ్యం సంగీతాన్ని స‌మ‌కూర్చారో వారే లైవ్‌లో పెర్ఫామెన్స్‌లు చేయ‌టం విశేషం. కింగ్ ఖాన్ ర్యాప్ సాంగ్ రూపొందించిన రాజా కుమారితో పాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ స్టేజ్‌పై త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. ఇంకా షారూఖ్, దీపికా ప‌దుకొనె, డైరెక్ట‌ర్ అట్లీ, మ‌క్క‌ల్ సెల్వ‌న్‌ విజ‌య్ సేతుప‌తి, సునీల్ గ్రోవ‌ర్‌, ఇంకా ఈ సినిమాలో షారూఖ్ లేడీ ఆర్మీగా న‌టించిన సాన్యా మ‌ల్హోత్రా స‌హా ఎంటైర్ టీం స‌భ్యులు పాల్గొన్నారు. న‌య‌న‌తార ఈవెంట్‌లో పాల్గొన‌లేక‌పోయారు. అయితే ఆమె త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ యూనిట్‌కు అభినంద‌న‌లు, అభిమానుల‌కు ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తూ వీడియో మెసేజ్‌ను పంపారు. ‘జవాన్’ స‌క్సెస్‌లో కీల‌క‌భూమిక పోషించిన ఇత‌ర సాంకేతిక నిపుణులు కూడా అక్క‌డ సంద‌డి చేశారు.

ముఖ్యంగా షారూఖ్ ఖాన్‌, దీపికా ప‌దుకొనె క‌లిసి చెలియా సాంగ్‌కు డాన్స్ చేయ‌టం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అలాగే రామయ్యా వ‌స్తావ‌య్యా సాంగ్‌కు షారూఖ్ స్పెష‌ల్ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇది అక్క‌డకు వ‌చ్చిన అభిమానుల‌కు మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది.

‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిచారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజైంది.