Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, మోగ్లీ 2025 నుంచి పవర్ ఫుల్ వనవాసం సాంగ్ రిలీజ్

బబుల్గమ్ తో సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల తన సెకండ్ మూవీ ‘మోగ్లీ 2025’ తో వస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన మోగ్లీ 2025 అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా గ్లింప్స్, టీజర్‌ను అద్భుతమైన స్పందన వచ్చింది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు, మేకర్స్ సెకండ్ సింగిల్ వనవాసం రిలీజ్ చేశారు.

కాల భైరవ స్వరపరిచిన ఈ పాటలో భావోద్వేగం పురాణ చిహ్నాలతో ఇంటెన్స్ గా కనిపిస్తుంది. రామాయణంలో పవిత్రమైన ప్రదేశంగా నిలిచిన అడవి మౌగ్లీ జర్నీకి నేపథ్యంగా నిలిచింది. యుద్ధాన్ని తలపించేలా కాల భైరవ కంపోజిషన్‌ పవర్ ఫుల్ గా వుంది.

కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ ఇతిహాస వైభవాన్ని, ఆధునిక ప్రేమ-సంఘర్షణ కథను అద్భుతంగా మేళవిస్తూ కవితాత్మకంగా రాశారు. శ్రీరాముడు సీతమ్మవారిని రక్షించేందుకు యుద్ధానికి వెళ్లినట్లే… హీరో కూడా తన ప్రేమను కాపాడేందుకు సిద్ధం అవుతున్నాడనే భావనను భావోద్వేగంతో చిత్రించారు. కాల భైరవ, సోనీ కోమండూరి వోకల్స్ ఫైర్ ని జోడించినట్లుగా, ప్రతి బీట్‌లోని డ్రామా మరింత ఎత్తుకు చేరుతుంది.

రొషన్ కనకాల పాత్రలో తెగువ, దృఢసంకల్పం అద్భుతంగా కనిపిస్తున్నాయి. రోషన్, సాక్షి మడోల్కర్ కెమిస్ట్రీ అందంగా కనిపిస్తుంది. బండి సరోజ్ కుమార్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించగా, వైవా హర్ష హీరో మిత్రుడిగా వినోదాన్ని పంచుతున్నారు.

సినిమాటోగ్రాఫర్ రామ మారుతి ఎం..మ్యాజికల్ విజువల్స్ అందించారు. ఎడిటింగ్‌ను కోదాటి పవన్ కళ్యాణ్ పర్యవేక్షించారు. కిరణ్ మామిడి ప్రొడక్షన్ డిజైనర్,నటరాజ్ మాదిగొండ యాక్షన్‌ను అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు.

ఈ చిత్రం డిసెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: కాల భైరవ
డిఓపి: రామ మారుతి ఎం
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్: కిరణ్ మామిడి
యాక్షన్: నటరాజ్ మాడిగొండ
సహ రచయితలు: రామ మారుతి. ఎం & రాధాకృష్ణ రెడ్డి
PRO: వంశీ-శేఖర్

Journalist Bharadwaj Reacts On Ayyappa Swamis Protest For Kanchanbagh Police station SI Issue || TR