అల్లరి నరేష్ చేతుల మీదుగా ‘తెప్ప సముద్రం‘ టీజర్

శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చైతన్య రావు హీరోలుగా కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ మ్యూజిక్ అందించాడు.

అయితే ఈ రోజు శివరాత్రి సందర్భంగా తెప్ప సముద్రం చిత్రం టీజర్ ను హీరో అల్లరి నరేష్ గారు విడుదల చేశారు.

టీజర్ చూస్తే అమ్మాయిలు మర్డర్ మిస్టరీ వెనుక దాగున్న ఆ రాక్షసుడు ఎవరు అనే కోణంలో ఆద్యంతం ఒక మిస్టరీగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. 2015 లో తెలంగాణాలోని హాజీపూర్ లో సంచలనం సృష్టించిన బావిలో స్కూల్ పిల్లల హత్యలు సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉంది. మరికొంత క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ అయిందాక వెయిట్ చేయాల్సిందే.

అల్లరి నరేష్ మాట్లాడుతూ “తెప్ప సముద్రం టీజర్ చూడగానే ఒక మంచి థ్రిల్ ఫీల్ వచ్చింది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.ఈ సినిమాని పెద్ద హిట్ చేయగలరని కోరుకుంటున్నాను” అని అన్నారు.

నిర్మాత నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ “నేను ఎంతగానో అభిమానించే నటుడు అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా తెప్ప సముద్రం టీజర్ రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ “ మా సినిమా టీజర్ అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది, ఏప్రిల్ 12 న విడుదల” అని తెలిపారు.

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ “ నరేష్ అన్న అడగ్గానే మా చిత్రం టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది..తెప్ప సముద్రం మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాం..ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాం” అని తెలిపారు.

చిత్రం పేరు : తెప్ప సముద్రం

నటీ నటులు : అర్జున్ అంబటి, చైతన్యరావు, రవి శంకర్, కిశోరి దాత్రక్ , తదితరులు

మాటలు : శ్రావణ్
ఎడిటింగ్ : సాయిబాబు తలారి
పాటలు: మంగ్లీ, పెంచల్ దాస్, హేమచంద్ర
సాహిత్యం : పెంచల్ దాస్, పూర్ణాచారి, బాలాజీ, పి.ఆర్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శేఖర్ పోచంపల్లి
సంగీతం : పి.ఆర్
డిజిటల్ మార్కెటింగ్ – ఎస్ 3 డిజిటల్ మీడియా
పి ఆర్ ఓ : పాల్ పవన్
నిర్మాత :నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సతీష్ రాపోలు