అభిరామ్ ‘అహింస’ ఏప్రిల్ 7న గా విడుదల

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘అహింస’ ఫస్ట్, టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘నీతోనే నీతోనే’, ‘కమ్మగుంటదే’ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

తాజాగా మేకర్స్ ‘అహింస’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అహింస ఏప్రిల్ 7న ప్రపంచంగా వ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలౌతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సినిమాకు సంబధించిన డిఫరెంట్ యాస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. తదుపరి ప్రమోషన్‌లను మేకర్స్ త్వరలో ప్రారంభిస్తారు.

ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు

సాంకేతిక విభాగం:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
నిర్మాత: పి కిరణ్
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
డీవోపీ : సమీర్ రెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల
సాహిత్యం: చంద్రబోస్
ఆర్ట్: సుప్రియ
యాక్షన్ డైరెక్టర్: బివి రమణ
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: శంకర్
సిజి: నిఖిల్ కోడూరి
పీఆర్వో: వంశీ-శేఖర్