అవుట్ స్టాండింగ్ సినిమా ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ చౌటపల్లి, పవిత్ర నారాయణ్ హీరో హీరోయిన్ గా వంశీకృష్ణ కన్నెగంటి సహా నిర్మాతగా ఆఫ్జాల్ దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం ” 10 రూపీస్”. ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి డైమండ్ రత్నబాబు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ, శ్రీని ఇన్ఫ్రా అధినేత శ్రీనివాస్, ఎ పి ఫిలిం ఛాంబర్ సెక్రటరీ జె వి మోహన్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు ఆఫ్జెల్ మాట్లాడుతూ “చిన్నపటినుంచి సినిమాలు అంటే పిచ్చి, నా తల్లిదండ్రులు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్నేహితులు, ఫామిలీ సహాయం తో అందరం కొత్తవాళం కలిసి 6 నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఏప్రిల్ 21న విడుదల అవుతుంది, సినిమా నచ్చితే 10 మందికి బాగుంది అని చెప్పండి. మా హీరో శ్రీకాంత్ చాలా అంకితభావంతో పని చేసాడు. మా హీరోయిన్ పవిత్ర నారాయణ అద్భుతంగా పని చేసింది. మా చిత్రం లో సీనియర్ నటులు ముక్తార్ ఖాన్ మరియు సూర్య చాలా సపోర్ట్ చేశారు. మా చిత్రం లో పాటలు లేవు, 2 గంటల చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖానా. సినిమా చూస్తున్నప్పుడు ఈ చిత్రానికి మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్, థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసారా అని అనిపిస్తుంది. టీజర్ మరియు ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ గణేష్ గారు మా సినిమా చూసి నిజాం అంతట రిలీజ్ చేస్తున్నారు. నాకు నా ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారు, అలాగే తల్లాడ సాయికృష్ణ తన వంతుగా సహాయం అందిస్తున్నారు. నేను ఎవరి దగ్గర పని చేయలేదు వి వి వినాయక్ గారు, పూరి జగన్నాధ్ గారు మరియు ఎన్ టి ఆర్ గార్లు నా గురువు గా భావిస్తాను. 10 రూపీస్ చిత్రం ఏప్రిల్ 21న విడుదల అవుతుంది. అందరు చూడండి” అని తెలిపారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ “రెండు సంవత్సరాల క్రితం నేను కలిసాను. డబ్బులు వృధా కాకుండా సినిమా ని నిర్మించుకో అని సలహా ఇచ్చాను. నేను ట్రైలర్ చూశాను అద్భుతంగా ఉంది. తన మేకింగ్ స్టైల్ బాగుంది. సోషల్ మీడియా పబ్లిసిటీ బాగుంది. ఏప్రిల్ 21న విడుదల అవుతుంది అందరు చూస్తారు అని కోరుకుంటున్నాను. దర్శకుడు ఆఫ్జాల్ కి నా బ్యానర్ లో ఒక చిత్రానికి అవకాశం ఇస్తున్నాను” అని తెలిపారు.
హీరో శ్రీకాంత్ చౌటపల్లి మాట్లాడుతూ “నాకు సపోర్ట్ చేసిన నా తల్లితండ్రులకి స్నేహితులకి ధన్యవాదాలు. మా డైరెక్టర్ ఆఫ్జాల్ గారు చాలా టాలెంట్ ఉంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లేడు, అని తానే చేసుకునే వాడు. చాలా బాగా డైరెక్షన్ చేశారు. మా కెమెరా మాన్, సంగీత దర్శకుడు అందరు ప్రాణం పెట్టి పని చేశారు. మా సినిమా అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ “10 రూపీస్ టైటిల్ చాలా కొత్తగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ఈ దర్శకుడు ఆఫ్జాల్ ని నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకుందాం అని పిలిచాను, కానీ తాను షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్ చేసి నాకు చూపించాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. మ్యూజిక్, కెమెరా పనితనం చాలా బాగుంది. ఏప్రిల్ 21న విడుదల అవుతుంది. మంచి హిట్ కావాలి” అని కోరుకున్నారు.
కో ప్రొడ్యూసర్ వంశి కృష్ణ కన్నెగంటి మాట్లాడుతూ “దర్శకుడు ఆఫ్జాల్ కి మంచి టాలెంట్ ఉంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా లేదు, షూటింగ్ కూడా చాలా జాగ్రత్తగా నిర్మించాడు. ఈ చిత్రం లో చివరి 45 నిమిషాలు వేరే లెవెల్ లో ఉంటుంది. మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు.
సంగీత దర్శకుడు వంశీ కాంత్ రేఖానా మాట్లాడుతూ “డైరెక్టర్ ఆఫ్జాల్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు, మంచి కథ తో మంచి స్క్రీన్ ప్లే తో అద్భుతమైన చిత్రాన్ని నిర్మించాడు, మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. మా హీరో శ్రీకాంత్ అద్భుతంగా నటించాడు. అందరం కొత్తవాళ్ళం కలిసి 10 రూపీస్ చిత్రాన్ని నిర్మించాము. అందరు సపోర్ట్ చేయండి” అని కోరుకున్నారు.
బ్యానర్ : అవుట్ స్టాండింగ్ సినిమా ప్రొడక్షన్
హీరో : శ్రీకాంత్ చౌటపల్లి
హీరోయిన్ : పవిత్ర నారాయణ్
నటీనటులు : సూర్య రావు, ముక్తార్ ఖాన్, తదితరులు
సంగీత దర్శకుడు : వంశీకాంత్ రేఖానా
కెమెరా మాన్ : చందు ఎ జె
పోస్ట్ ప్రొడక్షన్ : విషన్ స్టూడియోస్
డి ఐ : రవి తేజ
కో ప్రొడ్యూసర్ :వంశీకృష్ణ కన్నెగంటి
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్, ఎడిటింగ్, డైరెక్షన్ : ఆఫ్జాల్