ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో భాగంగా బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై కీలక విషయాల గురించి మాట్లాడారు. ప్రభుత్వ అవినీతి, లోపాలను ఎండగట్టాలని మోదీ సూచనలు చేశారు. ఏపీలో బీజేపీ పటిష్టానికి అందరూ కృషి చేయాలని ఆయన సూచనలు చేశారు. రాజకీయాల్లో నిదానం అస్సలు పనికిరాదని మోదీ పేర్కొన్నారు. మన పార్టీ మనకు ముఖ్యమని మోదీ కామెంట్లు చేశారు.
జాతీయ స్థాయిలో నిర్ణయాలను మేము చూసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ బీజేపీ నేతలను పలు ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకున్నారు. ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయనే ప్రశ్నకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన సోము వీర్రాజు సమాధానం చెప్పలేకపోయారు. రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయనే ప్రశ్నకు సైతం ఆయన కరెక్ట్ గా జవాబు చెప్పలేకపోవడం గమనార్హం.
అయితే మోదీ చెప్పింది ఒకటైతే ఎల్లో మీడియా పత్రికలలో ఒక పత్రిక ప్రధాని వైసీపీపై సీరియస్ గా ఉన్నట్టుగా ప్రచారం చేయడం గమనార్హం. వాస్తవానికి మోదీ పర్యటనను సక్సెస్ చేసే విషయంలో వైసీపీ పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. ఈ పర్యటనను సక్సెస్ చేయడం ద్వారా మోదీకి మరింత దగ్గర కావాలని జగన్ భావిస్తుండటం గమనార్హం.
మోదీ నమ్మకాన్ని వైసీపీ ఎప్పుడూ వమ్ము చేయలేదనే సంగతి తెలిసిందే. వైసీపీ వల్ల బీజేపీకి భారీ స్థాయిలో లాభం కలిగింది. వైసీపీని వదులుకుంటే నష్టమేనని బీజేపీ భావిస్తోంది. భవిష్యత్తులో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నా వైసీపీ సపోర్ట్ కొంతమేర కావాలి. అయితే కొన్ని పత్రికలు మాత్రం వైసీపీ బీజేపీని విడదీసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.