ఇదీ ఇండియన్ ఆర్మీ పవర్ అంటే (వీడియో)

ముంబై  రైల్వేస్టేషన్ లో ప్రమాదం తప్పింది. లోకల్ రైలు నుంచి కిందకు దిగుతున్న  మహిళ చీరకొంగు రైలు కడ్డీకి చిక్కింది. నడుస్తున్న రైలు మహిళను ఈడ్చుకెళుతుండగా వెనుక బోగిలో ఉన్న బిఎస్ ఎఫ్ జవాన్ గమనించి కిందకు దూకి మెరుపు వేగంతో మహిళను రైలుకింద పడకుండా పట్టుకున్నాడు. ఈ క్రమంలో జవాన్ కూడా కింద పడ్డాడు. కొద్ది దూరంలోనే ఆ మహిళ రైలు కింద పడకుండా పక్కకు పడటంతో అక్కడున్న వారు ఆ మహిళను పక్కకు లాగారు. జవాన్ సాహసంతో మహిళ స్వల్పగాయాలతో బయటపడింది. మహిళ ప్రాణాలను కాపాడిన  జవాన్ పై ప్రశంసల వర్షం కురిసింది. జవాన్ మహిళను కాపాడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో కింద ఉంది మీరు చూడండి.

[videopress QlVK1CA6]