పెళ్లయిన 48 గంటలకే మృతి చెందిన వధూవరుడు… అసలు ఏం జరిగిందంటే?

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అని భావిస్తారు ఇలా పెళ్లి చేసుకున్నటువంటి ఓజంట నిండు నూరేళ్లు తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలని భావిస్తారు కానీ ఈ జంట మాత్రం పెళ్లి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు స్మశానానికి వెళ్లారు. ఇలా నూతన వధూవరుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది ఇలా ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు ఈ క్రమంలోనే వరుడు క్షణికావేశంలో వధువుపై కత్తితో దాడి చేసే అనంతరం తాను కూడా కత్తితో పొడుచుకొని చనిపోయిన ఘటన
చత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్ బ్రీజ్‌నగర్‌లో చోటుచేసుకుంది.

చత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్ బ్రీజ్‌నగర్‌లో అస్లాం అనే 24సంవత్సరాల యువకుడు, కహకషా బానో అనే 21సంవత్సరాల యువతిని ఆదివారం వివాహం చేసుకున్నాడు. వీరి రిసెప్షన్‌ని ఇరు కుటుంబ సభ్యులు కలిసి మంగళవారం రాత్రి జరపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వీరిద్దరూ రెడీ అవ్వడం కోసం గదిలోకి వెళ్లారు ఇలా గదిలోకి వెళ్లిన ఈ నూతన దంపతులు మధ్య మాట పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. ఈ క్రమంలోనే వధువు పైవరుడు కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు అయితే వధువు అరవడంతో అక్కడికి చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు తలుపు కొట్టారు.

ఇక వధువును కత్తితో పొడిచిన వరుడు అనంతరం తను కూడా కత్తితో పొడుచుకొని మరణించారు అయితే ఈ ఘటనను కిటికీలోనుంచి చూసినటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అనంతరం పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇద్దరి మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి దీంతో పోలీసులు వీరిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు. ఈ పోస్ట్ మార్టంలో భాగంగా ముందుగా వరుడు వధువును చంపి అనంతరం తాను చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇలా పెళ్లి ఇంట్లో సంతోషంగా నెలకొనాల్సి ఉండగా విషాదఛాయలు అమ్ముకున్నాయి.