దేశంలో ఉన్న మొబైల్ వినియోగదారులకు ఝలక్ ఇచ్చేందుకు టెలికాం కంపెనీలు రంగం సిద్దం చేసినట్లు సమాచారం అందుతోంది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు, భారతీ ఎయిర్‌టెల్, మొబైల్ టారిఫ్‌లను భారీగా పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయట. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది మొబైల్ ఛార్జీలు పెంచలేదు. కానీ వచ్చే ఏడాది మాత్రం ఈ సంవత్సరానిది కూడా కలిపి వడ్డించేందుకు ప్రణాళికలు రచించాయట. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వచ్చే ఏడాది మార్చి లోపు మొబైల్ టారిఫ్‌లు పెంచుతాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుతం మొబైల్ టారిఫ్‌లకు ఫిక్స్‌డ్ ఫ్లోర్ ప్రైస్ లేదన్న విషయం తెలిసిందే. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ని…టెలికాం కంపెనీలు ఫ్లోర్ ప్రైస్‌ను కనీస పరిమితికి పెంచాలని చాలాకాలంగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అందుకు ట్రాయ్ సానుకూలంగా స్పందిస్తే.. మొబైల్ టారిఫ్‌లు పెరగడం కన్ఫామ్ అని తెలుస్తోంది.
ఇక టెలికాం సంస్థలు ప్రతి యూజర్ నుంచి రూ.300 వరకు నెలవారీ ఇన్‌కమ్ ఆశిస్తున్నాయి. కానీ ప్రస్తుతం వారు అంచనా వేసుకున్న లెవల్‌కు గిట్టుబాటు అవ్వడం లేదు. అయితే ఏఆర్‌పీయూ(నెలవారీ ఇన్‌కమ్) ను 20 శాతం మేర పెంచే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎటువైపు నుంచి చూసినా.. 2021లో మొబైల్ వినియోగదారులకు టారిఫ్‌ల పెంపు తప్పదని సమాచారం. అయితే డిసెంబర్ 2019లో 25 నుంచి 40 శాతం వరకు టారిఫ్‌లను పెంచారు. ఏడాది అవుతోన్న నేపథ్యంలో ప్రస్తుతం చార్జిలను పెంచాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ వల్ల ఆ నిర్ణయాన్ని టెలికాం కంపెనీలు వాయిదా వేశాయి.
ఇలాటెలికాం కంపనీలు… వినియోగదారుల నెత్తిన భారం వేయడానికి రెడీ అయ్యాయి. మూకుమ్మడిగా కంపెనీలు కొత్త రేట్లు, ప్లాన్లతో వినియోగదారులను ఝలక్ ఇవ్వనున్నాయి. రియలన్స్ జియో కూడా మిగతా కంపెనీలతో జతకలనున్నట్లు తెలుస్తోంది. సో మొత్తానికి వినియోగదారులు జేబులు గుళ్ల చెయ్యడానికి నెట్‌వర్క్ కంపెనీలు పక్కా ప్లానింగ్‌తో ఉన్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ..అన్ని కంపెనీలలానే జియో కూడా వడ్డిస్తుందో..పోర్టబులిటీ ద్వారా తమవైపు వచ్చిన వారికి కాస్తైనా ఊరటనిస్తుందో.