బిజెపిని నడిపేదెవరైనా సుష్మా స్వరాజ్ ను విస్మరించడం కష్టం…

పార్లమెంటులో నిండు భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా కనిపించే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జన్మదినం నేడు.  ఈ రోజు ఆమె 67 వ వసంతంలో ప్రవేశిస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా విశిష్టమయిన నాయకులున్నారు. వాళ్లలో సుష్మస్వరాజ్ ఒకరు.  ఎలాంటి దర్పం లేకుండా పార్లమెంటంతా చిరునవ్వులు చిందిస్తూ అందరిని పలకరిస్తూ  కలియతిరుగుతూ ఉంటారామె. మనిషి పొడగరి కాదు ,కాదు కాని ఉపన్యాసం లో  పార్లమెంటులో చాలా ఉన్నతమయిన పార్లమెంటేరియన్. మంచి వక్త. ఉత్తుత్తి వాగాడాంబరం ఉండదు. నాటకీయత ఉండదు. సహజంగా ఉపన్యసిస్తారు. సుదీర్ఘమయిన పార్లమెంటరీ అనుభవం ఉండటంతో సోదాహరణంగా సాగే ఆమె ఉపన్యాసాలు చాలా కన్విన్సింగ్ గా ఉంటాయి. మోదీ ప్రభుత్వంలో ఆమెకు అంతగా ప్రాముఖ్యం లేదని అంటుంటారు. ప్రధానియే విదేశీ వ్యవహరాల మంత్రయిపోయి అమెను డిప్యూటీ స్థాయికి మార్చారనే విమర్శకూడా ఉంది. అద్వానీ మనిషి అని పేరు పడినా  క్యాబినెట్ లో అమెకు సీటు దక్కడం విశేషం. ఇపుడామే మధ్య ప్రదేశ్ విధిష నియోజకవర్గంనుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 

రాజకీయాల్లోకి చాలా పిన్న వయసులోనే వచ్చారు.  20 సంవత్సరాల వయుసులో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.మొదట న్యాయవాది గా ఉండే వారు. 

హర్యానా అంబాలా కంటోన్మెంట్ లో  ఆమె 1952 ఫిబ్రవరి 14న జన్మించారు. 1977లో ఆమె  హర్యానా నుంచి అసెంబ్లీకి గెలవడంతో  ఆమె రాజకీయాలు కొత్త మలుపు తిరగాయి. అప్పటి నుంచి ఎపుడూ భారతీయ జనతాపార్టీలో ప్రాముఖ్యం తగ్గని లీడర్ గా కొనసాగుతున్నారు.సుదీర్ఘ కాలం పార్టీని ఎవరూ నడిపించినా సుష్మా ప్రాముఖ్యంగుర్తించి ఆమెను గౌరవించాల్సి రావడమే ఆమె పనితీరును ప్రతిభను వ్యక్తం చేస్తుంది.

మోదీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఆమె ప్రజలకు సహాయం చేయడంలో ఎపుడూ ప్రముఖ వార్తల్తోనే ఉంటూ వస్తున్నారు. గల్ఫ్ యుద్ధభూములనుంచి భారతీయులను బయటకు తీసుకురావడంలో, పాకిస్తాన్ చర్చల్లో, సుష్మా స్వరాజ్ అసమాన ప్రతిభ చూపారని మీడియా కీర్తించింది.

అన్నింటి కంటే ముఖ్యంగా సుష్మా స్వరాజ్ సోషల్ మీడియా ఆధారంగా విదేశాలకు వెళ్తున్న భారతీయులకు, ప్రవాస భారతీయుకుల చేస్తున్న సేవలు అంతా ఇంతా ఇంతా కాదు. పాస్ పోర్ట్, వీసా సమస్యలు ఆమె దృష్టికి వచ్చాయంటే అవి పరిష్కారమయినట్లే లెక్క. ఇవి మచ్చనకు కొన్ని ఉదాహరణలు

    1. పెళ్లికి ముందు పాస్ పోర్టో పోగొట్టుకున్నవారికి సహాయం
    1. చైనాలో నిలబడిపోయిన 20 మంది భారతీయులకు సహాయం
    1. ఎవరెస్టు శిఖరం వద్ద ఆగిపోయిన 15 మంది భారతీయులకు సహాయం
    1. యుఎఇ నుంచి తన సోదరిని కాపాడినందుకు కృతజ్ఞతలు
    1. ఇరాక్ లో చిక్కుకుపోయిన 20 భారతీయులను కాపాడారు