సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావుకు శిక్ష పడింది

సిబిఐ (తాత్కాలిక) డైరెక్టర్ ఎం నాగేశ్వరరావుకు  కోర్టు ధిక్కార కేసులో శిక్ష పడింది.  సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించి బీహార్ ముజఫర్ పూర్ శరణాలయంలో జరిగిన లైంగిక దాడుల కేసులో విచారణ జరిపిస్తున్న అధికారిని బదిలీ చేయడాన్ని కోర్టు ‘ధిక్కారం’గా పరిగణించింది. ఇది పొరపాటుకాదు, ఉద్దేశపూర్వకంగా కోర్టును ధిక్కరించడమేనని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మండిపడ్డారు.  ఆయనకు లక్ష రుపాయల జరినమాన విధించారు. అంతేకాదు, కోర్టు ముగిసేదాకా కోర్టు హాల్లో ఒక మూలన కూర్చోవాలని శిక్ష వేశారు. దేశంలోని ఒక అత్యున్నత విచారణాధికారికి ఇలాంటికి శిక్ష పడటం ఇదే  మొదటి సారి.

ఈ కేసులో పొరపాటు జరిగిందని, నాగేశ్వరరావు కోర్టుకు క్షమాపణలు చెప్పారు. కోర్టులో ఒక అఫిడవిట్ జారీ చేస్తూ, బీహార్ శరణాలయాల విచారణాధికారిని బదిలీ చేసే ముందు కోర్టు అనుమతి తీసుకుని ఉండాల్సి ఉండిందని, అలా జరగ లేదని, ఇది పొరపాటని అంగీకరిస్తున్నాను,’ అనినిన్ననే  నాగేశ్వరరావు కోర్టుకు  విన్నవించారుు. 

“I sincerely realise my mistake and while tendering my unqualified and unconditional apology, I specially state I have not wilfully violated the order of this court as I cannot even dream of violating or circumventing order of this court,” అని ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇది అతుక్కోలేదు.

దీనిని ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు. ‘ మీరు కావాలనే కోర్టు ఉత్తర్వులతో అడుకున్నారు. దేవుడే మిమ్మల్ని కాపాడాలి, ( You have played with our orders. God help you) అని ప్రధానన్యాయమూర్తి గత వాయిదా సమయంలోనే హెచ్చరించారు. ఈ రోజు శిక్ష విధించారు.

నాగేశ్వరావు తో పాటు సిబిఐ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కూడా ఇదే శిక్ష విధించింది కోర్టు.