పెళ్లి శుభలేఖ: చివర్లో ‘బీజేపి’ కే ఓటేయమంటూ రిక్వెస్ట్

ఇవి సోషల్ మీడియా రోజులు…ప్రతీది అక్కడ డిస్కస్ అవ్వాల్సిందే. అందుకే సినిమాల నుంచి రాజకీయ పార్టీలు దాకా సోషల్ మీడియాకు టైమ్, డబ్బు కేటాయిస్తున్నాయి. అయితే సోషల్ మీడియా కూడా ముదిరిపోయింది. అక్కడ ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరూ పట్టించుకోవటం లేదు.

చాలా తెలివిగా స్ట్రాటజీ ప్రకారం వెళితేనే సోషల్ మీడియాలో విన్ అవ్వగలం. ఈ విషయం గుర్తించిన రాజకీయ పార్టీలు …మెరికాల్లాంటి యూత్ ని సోషల్ మీడియా టీమ్ గా తీసుకుని అక్కడ తమ సామ్రాజ్యాలు స్దాపించే ప్రయత్నం చేస్తున్నాయి.

సోషల్ మీడియాను వినియోగించుకొని ప్రభుత్వంపై పాజిటివ్ ప్రచారం పెరిగేలా, ఓటింగ్ శాతం పెంచుకునేలా చూసుకోవాలని అధికార పార్టీలు భావిస్తున్నాయి.

 

మరీ ముఖ్యంగా 2014లో ప్రధాణంగా సోషల్ మీడియా ద్వారానే ప్రచారాన్ని చేపట్టి అధికారంలోకి వచ్చిన బీజేపి..ప్రస్తుతం కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం రాత్రింబవళ్లు ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ లలో ప్రచారం చేస్తూ సోషల్ మీడియా టీమ్ లు పనిచేస్తున్నాయి. తాజాగా ఓ చిత్రమైన స్ట్రాటజీని సోషల్ మీడియాని ప్లే చేసింది. ప్రభుత్వంపై సామాన్య ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని చెప్పేలా..ఓ శుభలేఖను క్రియేట్ చేసింది.

అందులో చివరన వివాహానికి గిప్ట్ గా …బిజేపి ఓటేయమని రిక్వెస్ట్ చేసింది. అది బీజేపీ స్ట్రాటజీ అని తెలియని వారు ..నిజమే అని ఆశ్చర్య పడుతూ ప్రచారం చేస్తారు. దాంతో కొందరైనా ప్రభావితం అయ్యే అవకాసం ఉంది. ఇలా రకరకాల కొత్త ఆలోచనలతో బీజేపి సోషల్ మీడియాలో సివంగిలా దూకుతోంది. అయితే కాంగ్రేస్ పార్టీ సోషల్ మీడియా సెల్ కూడా అంతే స్పీడుతో ఉంది. ఎప్పటికప్పుడు బీజేపి కు కౌంటర్స్ ఇస్తోంది. ఈ నేపధ్యంలో ఇంక రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి విచిత్రాలు చూసే అవకాసం ఉంది.