గోడౌన్లో 120 కోట్ల రూపాయల డ్రగ్స్ లభ్యం.. పోలీసుల అదుపులోకి ఎయిర్ ఇండియా మాజీ పైలెట్!

ప్రస్తుత కాలంలో యువతి యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ కు అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ మాఫియా పెద్ద ఎత్తున కలకలం సృష్టిస్తుంది. తాజాగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఓ గోడౌన్ నుంచి ఎన్‌సీబీ అధికారులు ఏకంగా 50 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని ధర సుమారు 120 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.ఇక ఈ కేసులో భాగంగా అధికారులు ఎయిర్ ఇండియా మాజీ కెప్టెన్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే వీరందరూ ముంబైకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఇలా అధికారులు అదుపులోకి వచ్చినటువంటి నిందితులను ఎన్సీబీ అధికారులు తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడినుంచి ఎక్కడికి సరఫరా చేస్తున్నారు. ఈ డ్రగ్స్ మాఫియాలో ఎవరి ప్రమేయం ఉందనే విషయంపై పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎన్సీబీ అధికారులు ముంబైలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇకపోతే ముంబై గోడౌన్లో ఏకంగా వారి స్థాయిలో డ్రగ్స్ పట్టి వేయడంతో అధికారులు పెద్ద ఎత్తున గాలింప చర్యలు చేపట్టారు.ఇక నిందితులను కొద్దిరోజుల పాటు తమ కష్టడిలో ఉంచుకొని ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అనే విషయంపై అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్నటువంటి వారు ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది.