వ్యాపారవేత్త చేతిలో 3.25 కోట్ల రూపాయలు నష్టపోయిన అల్లు అర్జున్ విలన్?

అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్రలో నటించారు భోజపురి నటుడు రవి కిషన్.ఈ సినిమాలో ఎంపీ పాత్ర కోసం ఆయన ఎంతో ఆరాటపడుతూ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ తో పోటీపడిన విషయం మనకు తెలిసిందే. ఇలా విలన్ పాత్ర ద్వారా ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మందిని ఆకట్టుకున్న రవి కిషన్ బోజ్ పూర్ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో హీరోగా మాత్రమే కాకుండా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయ నాయకుడిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నటుడు రవి కిషన్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నటుడు రవి కిషన్ ఎంపిగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త జితేంద్ర రమేష్ అనే వ్యక్తికి వ్యాపార నిమిత్తం 3.25కోట్ల రూపాయలను ఇచ్చారని అయితే ఇప్పటివరకు తన స్నేహితుడు తనకు ఆ డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో ఈయన పలుసార్లు తన స్నేహితుడితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

ఈ విధంగా జితేంద్ర తో కలిసి నటుడు రవి కిషన్ పలుమార్లు చర్చలు జరిపిన ఈయనకు ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇప్పటికీ తన స్నేహితుడు డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో రవి కిషన్ తన పిఆర్ఓ పవన్ దూబే ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇతని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.ఇలా స్నేహితుడితో వ్యాపారం నిమిత్తం నటుడు రవి కిషన్ కోట్లలో నష్టపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.