భారత్, పాకిస్తాన్ ల మధ్య స్నేహ పూర్వకంగా మొదలయిన రైలు సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను పాకిస్తాన్ ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులిచ్చేదాక నిలిపి వేసింది.
పుల్వామా టెర్రరిస్టు దాడి తర్వాత ఎదురయిన ఉద్రిక్త వాతావరణ మధ్య రైలు నడపడం సాధ్యం కాదని చెబుతూ ఈ ఎక్స్ ప్రెస్ సర్వీసును పాకిస్తాన్ నిలిపివేసిందని ఆదేశ పత్రికలు రాశాయి.
ఈ రైలు ప్రతి సోమ, గురు వారాలలో పాకిస్తాన్ లాహోర్ నుంచి బయలుదేరుతుంది.అయితే, వచ్చే సోమవారం నాడు 16 మంది ప్రయాణికులతో బయలు దేరాల్సిన ఈ రైలును నిలిపివేశారని రైల్వే అధికారులను ఉటంకిస్తూ డాన్ టివి రిపోర్ట్ చేసింది.
ఈ రైలు కరాచీ నుంచి బయలు దేరింది. అయితే లాహోర్ లో నిలిపివేయడంతో ఈ పదహారు మంది అక్కడి స్టేషన్ లో నిలబడిపోయారు.
సంఝౌతా అంటే హిందీలో అంగీకారం అని అర్థం. ఆరు స్లీపర్ బోగీలతో, మూడు ఎసి త్రి టియర్ బోగీలతో నడిచే ఈ రైలు 1976 జూలై 22న ఇరుదేశాల మధ్య కుదిరిని సిమ్లా ఒప్పందం అమలులో భాగంగా మొదలయింది. 1971 ఇండో పాక్ వార్ ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది.
ఇక, భారత్ నుంచి బయలుదేరాల్సిన సంఝౌతా ఎక్స్ ప్రెస్ బుధవారం రాత్రి ఢిల్లీ స్టేషన్ నుంచి ప్రయాణమయింది. అయితే, ఈ రైలును భారత్ లోని చివరి స్టేషన్ అత్తారి కస్టమ్స్ పాయింట్ వద్ద నిలిసివేశారు.
పాకిస్తాన్ వైపు నుంచి ఎక్స్ప్రెస్ సర్వీసులను నిలిపివేయడంతో అత్తారి దాటి పోయేందుకు వీల్లేదు. భారత్ నుంచి బయలుదేరిన రైలులో 27 మంది ప్రయాణికులున్నారు. ఇందులో ముగ్గురు పాకిస్తానీయులు. భారతదేశం ఈరైలును ప్రతి బుధ, ఆదివారాలలో నడుపుతుంది.
ఇదికూడా చదవండి
అల్లరి మూకల చేతినుంచి పాక్ లో అభినందన్ ఎలా తప్పించుకున్నాడు