పాకిస్తాన్ ఫ్రాడ్ : సూర్య కిరణ్ క్రాష్ చూపి ఇదే సాక్ష్యం అంటాంది

సోషల్ మీడియా రోజుల్లో యుద్ధం అంటే ఫేక్ వార్తలాగే ఉంటుందేమో. బాలాకోట్ తీవ్రవాద శిబిరం పై భారత వైమానికా దాడి జరిగిం తర్వాత పాకిస్తానీయుల అహం బాగా దెబ్బతినింది. ఎలాగైనా సరే భారత్ కు తగిన సమాధానం చెప్పాలనుకుంది. దీనికి తోడు సోషల్ మీడియా తోడయింది. సోషల్ మీడియా వత్తిడి పాకిస్తాన్ మీద తీవ్రమయింది.

 భారతదేశానికి చెందిన రెండు విమానాలు ఈ ఉదయం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఇవి కూలిపోతూనే, అచ్చం తీవ్రవాద సంస్థల్లగా పాకిస్తాన్ పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని కూల్చేసింది మేమే అని చెప్పేసింది.

పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఇవి కూల్చేంది తామేనని ట్వీట్ చేశాడు.

దీనితో పాకిస్తాన్ సోషల్ మీడియా విజృంభించింది.అయితే, ఇండియన్ ట్విట్టరోళ్లు కూడా తక్కువేం కాదు, విమానాలు కూల్చేసి ఉంటే ప్రూఫ్ చూపండని దబాయించడం మొదలుపెట్టారు. ఇక్కడ పాకిస్తాన్ చిక్కుల్లో పడింది. వెంటనే ఒక కూలిపోతన్న విమానం, అందులోనుంచి ఎజెక్టయిన పైలట్ వీడియో ను విడుదల చేసి ఇదే సాక్ష్యం అనేశారు.

అక్కడేపప్పులో కాలేశారు.

ఆవీడిమో పాకిస్తాన్ లోది కాదు. నాలుగయిదురోజుల కిందట ఎయిరో ఇండియా 2019 బెంగుళూరు షో సమయంలో కూలిపోతున్న సూర్యకిరణ్ విమానానిది.

ఎయిర్ షో లో బాగాంగా పైకెగిరిన రెండు విమానాలు గాల్లోనే ఢీకొని కూలిపోయాయి. ఇది ఫిబ్రవరి 19న జరిగింది. బెంగుళూరు యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద హారహల్లి ఇస్రో లే అవుట్ దగ్గిర వీడియో అది. పాకిస్తాన్ లోనిది కాదు.

ఇండియన్ నెటిజన్ల నుంచి సాక్ష్యం కోసం వత్తిడి పెరగడంతో ఏదో ఒక వీడియో చూపించాల్సి వచ్చింది. బెంగుళూరు సూర్యకిరణ్ కూలిపోతున్నప్పటి వీడియో దొరికింది అంతే, అంతే ప్రూఫ్ గాచూపించారు. ‘ ఇండియన్ పైలట్ ను సజీవంగా పట్టుకున్నారు. ఇండియాకే కాదు, హోల్ మొత్తం ప్రపంచానికిదే ప్రూఫ్ ’ అని పాక్ ట్విట్టర్ మార్మ్రోగిపోయింది.

ఈ వీడియోలో స్థానికులు కన్నడ మాట్లాడుకోవడం కూడా వినిపించిందని , కూలిపోతున్న పైలట్ విజయ్ షిల్కే కు సహాయం అందించండని అరవడం కూడా ఉందని దక్కన్ హెరాల్డ్ రాసింది.

పాకిస్తానీయులు కన్నడ ఎపుడునేర్చుకున్నారో. ఈ ఫేక్ న్యూస్ క్యాంపెయిన్ ను పాకిస్తాన్ టివి సిఇవొ షాహిద్ మసూద్ ఇంకోలెవెల్ కు తీసుకెళ్ళారు. సూర్యకిరణ్ క్రాష్  చూపి పాకిస్తాన్ రెండో పైలట్ కూడా దొరికిపోయినట్లు వీడియో చూపారు.