భారత్ దాడికి పాకిస్తాన్ స్పందన

భారత వైమానికి దళాలు ఈ తెల్ల వారు జామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ సెక్టర్ లోని తీవ్రవాద శిబిరాల మీద జరిపిన దాడి మీద పాకిస్తాన్ స్పందించింది. ఇంత తొందరగా భారత్ దాడి చేస్తుందని పాకిస్తాన్ వూహించలేకపోయింది. భారత్ దాడులు చేస్తే ఏమి చేయాలనే దాని మీద తర్జన భర్జనలు జరుగుతుండగానే భారతీయదళాలు విజయవంతంగా పాక్ అక్రమిత కాశ్మీర్ లోకి ప్రవేశించి బాంబులు వేసి వచ్చాయి.ఇది పాక్  మిలిటరీకి, ప్రధాని ఇమ్రాన్ ప్రభుత్వానికి కూడా చెంపపెట్టే.

పాకిస్తాన్ రియాక్షన్ చూడండి… ఎన్ని సార్లు ఎలా  మారిందో..

ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ ను అతిక్రమించడమే నని పాక్ సైన్యం పేర్కొంది.  పాక్ ఆక్రిమిత కాశ్మీర్ లో మూడు నాలుగు మైళ్లు లోపలికి చొరబడ్డాయని, తర్వత బాంబులను వేసి హడావిడిగా వెనుదిరిగిపోయాయని  పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం మేజర్ జనరల్ ఆసిఫ్ గఫార్ ట్వీట్ చేశారు.
తర్వాత మరొక ట్వీట్ చేస్తూ ఇలా చెప్పారు.
భారత వైమానికి దళం ఎల్ వొసి ని అతక్రమించింది. ఈ లోపు పాకిస్తాన్  వైమానిక దళం అప్రమత్తమయింది. వెంటనే భారతీయ యుద్ధ విమానలు వెనక్కు వెళ్లిపోయాయి. 
 
తర్వాత మరొక ట్వీట్ చేస్తూ పాక్ విమానాలు  సకాలంలో స్పందించడంతో  భారత్ యుద్ధ విమానాలు హడావిడిగా  వెనక్కు వెళ్తిపోవలసి వచ్చింది. పోయేటపుడు బాంబులను వదిలేశాయి. అవి బాలాకోట్ దగ్గిర పడ్డాయని పాకి ప్రతినిధి తెలిపారు.

In a follow-up post, he added that the planes violated LoC through Muzaffarabad sector. “Facing timely and effective response from Pakistan Air Force released payload in haste while escaping which fell near Balakot,” he said.