కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేసినా ఆ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం అనే సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా భార్యాభర్తలు నెలకు 10,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు.
రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ప్రతి నెలా ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎంత తక్కువ వయస్సులో ఈ స్కీమ్ లో చేరితే అంత ఎక్కువ బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. వయస్సును బట్టి చెల్లించే ప్రీమియంలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
1000 రూపాయల పెన్షన్ కావాలంటే నెలకు 42 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరూ పెన్షన్ ను తీసుకునే అవకాశం అయితే ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తలు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకొని ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. మోదీ సర్కార్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనం కలిగే పథకాల దిశగా అడుగులు వేస్తోంది.