మోదీ సర్కార్ శుభవార్త.. ప్రతి నెలా రూ.20,000 సులువుగా పొందే అవకాశం?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ మధ్య కాలంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సేవింగ్ స్కీమ్స్ కు సంబంధించి కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. పలు స్కీమ్స్ కు సంబంధించి కేంద్రం డిపాజిట్ లిమిట్ ను రెట్టింపు చేయడం గమనార్హం. ఇలా జరగడం వల్ల ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు బెనిఫిట్ కలగనుంది.

కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కూడా ఒకటి. ఇప్పటికే ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ఎక్కువ మొత్తంను పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో 30 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై వడ్డీ రేటు 8 శాతంగా ఉంది.

ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఎక్కువ కాగా ఈ స్కీమ్ ను మరో మూడు సంవత్సరాల పాటు పెంచుకునే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్ లో భాగంగా ఎవరైనా 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు 20,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా ఐదేళ్లలో 12 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 6667 రూపాయలు వడ్డీ రూపంలో పొందవచ్ఛు. వేర్వేరు అకౌంట్లలో ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. మోదీ సర్కార్ ఈ స్కీమ్స్ పై లిమిట్స్ ను పెంచడం ద్వారా వాళ్లకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.