అభినందన్ మీసం తర్వాత ఇపుడు మోదీ చీరెలొచ్చాయ్

 

పుల్వామా టెర్రరిస్టు దాడి, బాలాకోట్ మీద భారత వాయుసేన దాడి…తర్వాత దేశమంతా దేశభక్తితో వూగిపోయింది. ప్రధానిమోదీ ప్రతిష్ట బాగా పెరిగిపోయింది. ప్రధాని మోదీ పాకిస్తాన్ కు తగని బుద్ధి చెప్పారనే భావం జనంలో బాగ ప్రబలిపోయింది. ప్రధాని మోదీ దెబ్బకు భయపడి, బందీగా పట్టుకున్న భారత పైలట్ ను  48గంటల్లోపే వెనక్కు పంపాలని పాకిస్తాన్ నిర్ణయించుకుందని చాలా మంది నమ్ముతున్నారు. దేశమంతా ఇలా చెలరేగిన జాతీయభావాలను సొమ్ముచేసుకునేందుకు బాలివుడ్ ఒక వైపు తెగు ప్రయత్నాలు చేస్తున్నది. బాలాకోట్, పుల్వామా, సర్జికల్ స్ట్రయిక్, అభినందన్,  ఐఎఎఫ్ వంటి పేర్లతో సినిమాలు తీసి దేశం వదిలేందుకు డజన్ల కొది నిర్మాతలు ఈటైటిల్స్ రిజిస్టర్ చేసుకుంటున్నారు.

మరొక వైపుటె క్స్ టైల్ రంగంలో కూడా మోదీ మోజును వ్యాపారంగా మార్చుకునే ప్రయత్నం జరగుతుూ ఉంది. ముంబాయిక చెందిన ఒక బట్టల వ్యాపారి మోదీ సర్జికల్ స్ట్రయిక్ చీరెలను మార్కెట్ లోకి వదిలాడు. రంగు రంగుల పూల బ్యాక్ గ్రౌండ్ లో మోదీ ముఖాన్ని రకరకాల భంగిమల్లో ముద్రించిన  చీరెలు విడుదల చేశారు. మెదీ ముఖంతో పాటు భారత వైమానిక దాడులు, సైన్యం, ప్యారషూట్ వంటి బొమ్మలు ఈచీరెల మీద కనిపిస్తాయి.

ముంబాయి పానేరీ షాప్ ఈచీరెలు విడుదల చేసింది. చీరె ధర  రు. 1750 . ఇప్పటికే 2200 చీరెలు అమ్మినట్లు పానేరీ షాప్ యజమాని వినోద్ గాడా చెప్పారు.

ఎన్నికలు దగ్గిర పడేకొద్ది వ్యాపారం జోరందుకంటుందని ఆయన ఆశిస్తున్నారు.

పుల్వామా పర్యవసానాలు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పైలట్ అభినందన్ వర్థమాన్ మీసపు కట్టు చాలా పాపులర్ అయింది. వందలాది యువకులు  ఈ మీసపు కట్టు చేయించుకుంటున్నారు. తమ దేశభక్తిని, చాటుకునేందుకు చాలా చోట్ల ఈ మీసపు కట్టు చేయించుకునేవారికి ఉచితంగా సర్వీస్ అందించేందుకు సెలూన్లు ముందుకు వస్తున్నారు. దీ

 ఈట్రెండ్ కు ఇపుడు మోదీ చీరెలు తోడవుతున్నాయి.

 

 

.