పుదుచ్చేరి లె.గవర్నర్ కిరణ్ బేడీ కొత్త అవతారం ఇది

సంచలనాల మాజీ ఐపిఎస్ అధికారి కిరణ్ బేడీ మరొక సంచలనం సృష్టించారు. ఇపుడు పుదుచ్చేరి గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీ అదివారం నాడు ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తారు. ఎపుడూ బిజిగా ఉండే పుదుచ్ఛేరి- విల్లుపురం రోడ్డులో ఆమెప్రత్యక్షమయి, హెల్మెట్ లేని ద్విచక్రవాహనాదారులను పట్టుకోవడం మొదలుపెట్టారు. హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్న బైక్ వాహనదారులను ఆపి, ఇలా ప్రయాణం చేయడం ఎంత ప్రమాదమో హెచ్చరించి, హెల్మెట్ వాడి తీరాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. 

దేశంలో తొలి మహిళా ఐపిఎస్ అధికారి అయిన కిరణ్ బేడీ సర్వీసులో ఉన్నాపుడు, లేనపుడు కూడా వార్తల్లోనే ఉంటూవస్తున్నారు. ఇపుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎపుడూ వార్తల్లో కెక్కుతున్నారు. మామూలుగా గవర్నర్లు ఎక్కువ శ్రద్ధ చూపేది గుళ్లుగోపురాల మీద. హోదాకు తగని పనులు వాళ్లెపుడు చేయరు. ఈ గవర్నర్లకు కిరణ్ బేడీకి తేడా అదే. ఆమె ఇపుడు ట్రాఫిక్ పోలీసుగా మారి  పుదుచ్చేరిలో కలకలం సృష్టించారు.

ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నొఒక బైక్ కూడా ఆమె కంట పడింది. వెంటనే బైక్ ను ఆపి ఒకే బైక్ పై ముగ్గురు వెళ్లడం తప్పని  ఎంత ప్రమాదమో చెప్పి, మూడో వ్యక్తి దింపేశారు. రోడ్డు మీద ఉన్నంత సేపు ఆమె హెల్మెట్ లేకుండా కనిపించిన ప్రతి బైక్ ను నిలిపేశారు. వాళ్లందరితో హెల్మెట్ గురించి మాట్లాడాలని అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులను కూడా పురమాయించారు. 

హెల్మెట్ లేకుండా పోతున్నవాళ్లందరి, ‘నీ హెల్మెట్ ఎక్కడయ్యా’ అని అరచి నిలిపేశారు.
తర్వాత ఆటోలలో కూడా పరిమితికి మించి ఎక్కించుకోరాదని ఎక్కువ మందితో వెళ్తున్న ఆటోను నిలిపి వారికి క్లాస్ తీసుకున్నారు.అందులోనుంచి కొంతమందిని దించేశారు. పుదుచ్చేరిలో ఆమెకు, ముఖ్యమంత్రి వి నారాయణ స్వామికి చాలా కాలం గా ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా ఆమె ముఖ్యమంత్రిని వదల్లేదు. నియమాలను అమలుచేయకుండా ముఖ్యమంత్రి ఎపుడూ అడ్డుపడుతున్నారని కూడా ట్విట్లర్ లోపేర్కొన్నారు.

ట్టిట్లర్ లో ఆమె తీసుకున్న చర్యలకు బాగా ప్రశంసలొచ్చాయి.