గుజరాత్ కాంగ్రెస్ కు షాక్… బిసి నేత అల్పేష్ థాకోర్ రాజీనామా

 గుజరాత్ లో  పునర్వైభవం కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఒక ప్రముఖ బిసి నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు, ఆయన బిజెపిలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది.

2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ కు సహకరించిన బిసి నాయకుడు ,ఎమ్మెల్యే అల్పేష్ థాకోర్, మరొక ఇద్దరు ఎమ్మెల్యేలతో కలసి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.

గుజరాత్ లో ఈ లోక్ సభ ఎన్నికల్లో కూడా  2017 అసెంబ్లీ  ఎన్నికల హవాను కొనసాగించేందుకు కాంగ్రెస్ తంటాలు పడుతున్నపుడు ఈ షాక్ ఎదురయింది. రాష్ట్రంలో ని 26 లోక్ సభ స్థానాలకు ఈ నెల 23 న పోలింగ్ జరుగుతున్నది.

అల్పేష్ పార్టీ నుంచి వెళ్లి పోతాడాని చాలా రోజులుగా పుకారు వినబడుతూ ఉంది. బుధవారం నాడు తను రాజీనామా చేసిన విషయం ప్రకటించి ఈ విషయం మీద అల్పేష్ స్పష్టత ఇచ్చారు. ఆయన ఎఐసిసి కార్యదర్శి కూడా. పార్టీకి రాజీనామా చేసినా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు.

రాష్ట్రంలో కొత్త గా ఎదిగిన వెనకబడిన వర్గాల నాయకుడు అల్పేష్. ఈ ఎన్నికల్లో ఆయన కులానికి చాలా ప్రాముఖ్యం వుంది. ముఖ్యంగా బనస్కాంత , పటాన్ లోక్ సభ నియోజకవర్గాలలో ఆయన క్షత్రియ కులానికి వోట్లు బాగా ఉన్నాయి.   ఇలా ప్రాముఖ్యం ఉన్న వ్యక్తి  పార్టీ పదవులన్నింటికి రాజీనామా చేేశారు. ఈ మేరకు అల్పేష్ గుజరాత్ పిసిసి అధ్యక్షుడు అమిత్ చావ్దాకు లేఖ రాశారు. ఆయన తోపాటుపార్టీ శాసన సభ్యులు దవల్ సిన్హ్ జాలా (బయాద్ నియోజకవర్గం), భరత్ సిన్హ్ ధాకోర్ (బేచారాజీ) లు కూడా పార్టీ కి రాజీనామా చేశారు. కాంగ్రెస్ రాజీనామా చేసిన విషయాన్ని ప్రకటించినా, తాము బిజెపి లో చేరుతున్నట్లు వస్తున్నవార్తలను ఆయన ఖండించారు. అయితే, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తుతం గుజరాత్ లోనే ఉన్నారు. ఏమవుతుందో నని అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుందని ఆయన ఆరోపించారు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో తాను గుజరాత్ క్షత్రియ థాకోర్ సేన తరఫున ప్రచారం చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఈ సంస్థ తరఫున ఒక అభ్యర్థి బనస్కాంత లోక్ సభకు, ఉంజా అసెంబ్లీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.

2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్ల బిజెపి, ముఖ్యంగా ప్రధాని మోదీకి చెమటలు పట్టించిన వ్యక్తులు ముగ్గురు యువనాయకులు. వారు, బిసి నాయకుడు అల్పేష్ థాకోర్, జాట్ నాయకుడు హార్దిక్ పటేల్, దళిత నాయకుడు స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని. వీళ్లు సృష్టించిన సుడిగాలి వల్లే అక్కడ కాంగ్రెస్ బలం పుంజుకుంది. అధికారంలోకి రాలేకపోయినా, గుజరాత్ బిజెపి ఉధృతి అడ్డుకట్ట వేసి మెజారిటీ బాగా తగ్గించగలిగింది కాంగ్రెస్. ఇది బిజెపిని కుదిపేసింది. ఆ ఎన్నికలప్రభావం లోక్ సభ ఎన్నికల మీద పడకుండా ఉండేందుు రకారకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది.

అల్పేష్ ఎందుకు రాజీనామా చేశారు?

లోక్ సభ ఎన్నికల్లో తన భార్య పో టీచేసేందుకు కాంగ్రెస్ నుంచి అంగీకారంలో రానందునే పార్టీ మీద కోపంతో అల్పేష్ రాజీనామ చేశారని ఒక విషయం రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఈ కథనం ప్రకారం, భార్యను పటాన్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేయించాలని అల్పేష్ అనుకున్నారు.

అయితే, కాంగ్రెస్ ఆ సీటును అల్పేష్ కుటుంబానికి ఇచ్చేందుకు నిరాకరించింది. దీనికి కారణం, ధాకోర్ సేనలో కూడా అల్పేష్ కు వ్యతిరేకత మొదలయింది. ఈ సంస్థలోని తన అనుయాయులకు టికెట్ ఇప్పించడానికి బదులు భార్య కోసం ప్రయత్నించడంతో ధాకోర్ సేన లో ఆయన రాజకీయాల మీద అసంతృప్తి మొదలయిందని బాగా వినబడుతూఉంది.

ప్రతీకారంగా ధాకోర్ సేన సొంతంగా ఒక అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టింది. అంతేకాదు, కుల సంస్థతరఫున నిలబడిన అభ్యర్థికి ప్రచారం చేస్తావా లేక కాంగ్రెస్ లోనే ఉంటావో తేల్చుకోవాలని అల్టిమేటమ్ జారీ చేసింది.

కులం మద్దతు పోతే తన రాజకీయ ఉనికికే ముప్పు వస్తుందని భావించినట్లున్నారు, ఆయన కాంగ్రెస్ నుంచి బయటపడాలనుకున్నారు. అదే సమయంలో బిజెపితో మంతనాలు ప్రారంభించారని, గుజరాత్ క్యాబినెట్ లో మంత్రి పదవి ఇస్తే పార్టీ లో చేరేందుకు సిద్దమని బేరం పెట్టినట్లు చెబుతున్నారు.
నేడో రేపో ఈ విషయం , షా పర్యటన సమయంలోనే అల్పేష్ రాజకీయ భవిష్యత్తు మీద స్పష్టత వస్తుందని అనుకున్నారు.

అల్పేష్, జాట్ నాయకుడు హార్దిక్ పటేల్, స్వతంత్ర ఎమ్మెల్యే జగ్నిష్ మేవానీలు ఆఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకునేందుకు దోహదపడ్డారు. అయితే, అల్పేష్ ఈ ఎన్నికల్లో పటాన్ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ప్రయత్నించారు. ఆయన టికెట్ ఇవ్వలేదు. అందుకే అలిగి పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు. గుజరాత్ లో ఈ నెల 23 న 26 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. ఆయన బిజెపిలోకి వెళతారని వార్తలొస్తున్నాయి. కాదు, గుజరాత్ క్షత్రియ ధాకోర్ సేన తరఫున ప్రచారం చేస్తారని మరొక వార్త. ఈ రోజు బిజెపి అధ్యక్షుడుషా గుజరాత్ వెళ్తున్నారు. ఏమవుతుందో చూడాలి.