మంచి రోజులు రాబోతున్నాయి .. జనవరిలో వ్యాక్సినేషన్ : కేంద్ర మంత్రి హర్షవర్థన్!

china released corona vaccine last month

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి జోరు రోజురోజుకి కొంచెం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రతీరోజూ 20 వేలకు మించి కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇటువంటి తరుణంలోనే ప్రభుత్వం వచ్చే ఏడాది టీకాకరణ కార్యక్రమం చేపట్టాలని భావిస్తూ, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సందర్భంగా   మాట్లాడుతూ మిగిలిన దేశాలతో పోలిస్తే, మన దేశంలో కరోనా రికవరీ రేటు అత్యధికంగా ఉందన్నారు. ఇది 95 నుంచి 96 శాతం మధ్య ఉంది.అమెరికా, రష్యా, బ్రెజిల్ తదితర అభివృద్ధి చెందిన దేశాలలో రికవరీ రేటు 60 నుంచి 80 శాతం మధ్యన ఉందన్నారు.

మన దేశంలో కరోనా డెత్ రేటు 4.45 శాతంగా ఉంది. ఈ కరోనా చెడ్డకాలం త్వరలోనే ముగియనుంది. అయినా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో జనవరి నుంచి కరోనా టీకాకరణ ప్రారంభం కానుంది. ముందుగా అత్యవసరమైన వారికి కరోనా టీకా ఇవ్వడం జరగుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధి విషయంలో మిగతా దేశాలకు భారత్ ఏమాత్రం తీసిపోదని డాక్టర్ హర్ష్‌వర్దన్ వ్యాఖ్యానించారు. టీకా భద్రత, సామర్థ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.