జైల్లో కూడా అదే పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న హనీప్రీత్

డేరాబాబా..ఇది దేశమంతటా సంచలనం సృష్టించిన పేరు. ఇద్దరు సాధ్విలను అత్యాచారం చేసిన కేసులో గత ఏడాది ఆగష్టులో అరెస్ట్ అయ్యాడు గురుమీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరాబాబా. ఇక డేరాబాబాకు శిక్ష ఖరారు చేసిన వెంటనే పంచకులలో విధ్వంసం సృష్టించారు అతని అనుచరులు. ఈ అల్లర్లకు ప్లాన్ వేసిన డేరాబాబా దత్తపుత్రిక హానిప్రీత్ ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అంబాలా జైల్లో ఖైదీగా జీవితాన్ని గడుపుతోంది.

హనీప్రీత్ ఎప్పుడు డిజైనర్ దుస్తులు ధరించి ట్రెండీగా కనిపించేది. తన దుస్తులు తనకు నచ్చినట్టు డిజైన్ చేయించుకునేది. డేరాబాబా నటించిన సినిమాలకు కూడా ఈమే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేదట. ఇప్పుడు జైల్లో కూడా అదే పని చేస్తూ డబ్బులు సంపాదిస్తుందట ఈ లేడీ విలన్. అంబాలా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సంస్థ నిర్వహించే కోర్సుల్లో శిక్షణ తీసుకుంటుందట హానిప్రీత్. తోటి మహిళా ఖైదీలతోపాటు డ్రెస్ డిజైనింగ్, బ్యూటీ టిప్స్, బ్లాక్ ప్రింటింగ్ శిక్షణ తీసుకుంటుంది. ఈ విషయాన్ని జైలు అధికారులే తెలిపారు. ఖైదీలలో పరివర్తన కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో హనీప్రీత్ కూడా చేరిందని, ఆమెలో కూడా సత్ప్రవర్తన కలుగుతోందని వెల్లడించారు అధికారులు. ఎప్పుడూ స్పెషల్ గా కనిపించటానికి డ్రెస్సెస్ డిజైన్ చేసుకునే హనిప్రీత్ ఇప్పుడు జైల్లో కుట్టు మిషన్ కుడుతూ డబ్బులు సంపాదిస్తుంది. డ్రెస్సులు డిజైన్ చేసిన అనుభవం ఉంది కదా ఈ పని చాలా తేలికగానే ఉంటుందిలే దత్తపుత్రికకి.