షాకింగ్ : హీరో అర్జున్ కు మీ టూ సెగ

“మీ టూ” ఉద్యమం హాలీవుడ్ లో మొదలయ్యి పలు దేశాల్ని తాకింది. మన దేశంలో కూడా ఈ ఉద్యమం ఊపందుకుంది. దక్షిణ భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా ఈ మీ టూ సెగ  ప్రముఖ దక్షిణాది హీరోని కూడా తాకింది. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో బాగాపాపులర్ అయిన   హీరో అర్జున్ మిటూ లో ఇరుక్కున్నారు. ఆయన పై కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు.

ఇప్పుడు ఈ విషయం దక్షిణాది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సినీ ఇండస్ట్రీలో దీని గురించి హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఒక సినిమాలో అర్జున్ భార్యగా నటించారు శృతి. ఆ సినిమా షూటింగ్ సమయంలో తనకి ఎదురైనా చేదు అనుభవం గురించి ఫేస్బుక్ లో షేర్ చేసుకుంది. ఆ వివరాలు కింద ఉన్నాయి చూడండి.

“అర్జున్ తో కలిసి 2016 లో ఒక ద్విభాషా చిత్రంలో నటించాను. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయనతో కలిసి నటించే అవకాశం రావడంతో చాలా సంతోషించాను. ఆ సినిమాలో నది అర్జున్ భార్య క్యారెక్టర్. ఒకరోజు రొమాంటిక్ సీన్ రిహార్సిల్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన నన్ను చాలా గట్టిగా హగ్ చేసుకుని వీపు మొత్తం అసభ్యకర రీతిలో తడిమారు. పైగా డైరెక్టర్ తో సీన్ లో ఇంత గాఢమైన రొమాన్స్ చూపిద్దామని చెప్పారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను. ఆయన అలా చేసినందుకు అసహ్యం వేసింది.” అని వెల్లడించింది శృతి హరిహరన్.

ఈ విషయంతో పాటు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీ గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. కాగా శృతి చేసిన ఆరోపణలపై స్పందించారు హీరో అర్జున్. ఆమె ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. “నాపై వచ్చిన ఆరోపణల గురించి తెలిసి షాక్ అయ్యాను. అవన్నీ నిరాధారం, అవాస్తవం” అని వెల్లడించారు అర్జున్.