బంగారు ధర బాగా పెరుగుతోంది…

ఒక వైపు స్టాక్ మార్కెట్లలో మందం వస్తే, మరొక వైపు బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. గత ఏడాది లాగే ఈ 2019 లో కూడా బంగారం ధర పెరుగుతుందని మార్కట్లో ఉహాగానాలు వినబడుతున్నాయి. అంతకు ముందుసంవత్సరంతో పోలిస్తే 2018లో బంగారం ధరలు 8 శాతం పెరిగాయి. 2018 జనవరి ఒకటో తేదీన ముంబాయి మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రు. 29,525 ఉండింది. డిసెంబర్ నాటికి అది రు.31710 కి పెరిగింది. ఒక దశలో అది రు. 32 వేలు దాటింది కూడా.

కొత్త సంవత్సరం బంగారం మంచి హుశారులో ఉంది. గురువారం నాడు ఢిల్లీలో రు. 335 పెరిగి పది గ్రాముల ధర రు. 32,835కు చేరింది. డాలర్ పోలిస్తే రుపాయ ధర పడిపోవడం, ప్రజలు బంగారు కొనడం సురక్షిత పెట్టుబడగా బావిస్తూ ఉండటం దీనికి కారణమని అఖిల భారత షరాఫ్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. మంగళ వారం, బుధవారం కూడా బంగారం ధరలు పెరిగాయ. మంగళవారం నాడు రు. 200, బుధవారం నాడు రు.30 మాత్రమే పెరిగాయి. గురువారం ఇది రు. 335 కు చేరుకుంది.

ఢిల్లీలో 99.9 శాతం ప్యూర్ బంగారు పది గ్రాముల ధర రు. 32,835 ఉంటే 99.5 శాతం ప్యూర్ బంగారు ధర రు. 32,685 కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారు ధర మంచి రేటు పలుకుతూ ఉంది. ఔన్స్ ధర 1290.82 అమెరిన్ డాలర్లు పలికింది.

వెండి కూడా బంగారు బాటలో నే నడుస్తూ ఉంది. కేజీ వెండి ధర రు. 350 పెరిగి, రు.39,700లకు చేరింది.