ప్రస్తుతం ఫ్యాషన్ మోజులో పడి అంతా తమను తాము మర్చి పోతున్నారు. సాంప్రదాయాలు, విలువలు అయితే గుర్తుకే లేవు. ఆ ఫ్యాషనే ఆమె భర్తతో దెబ్బలు తిని కాలు విరగ్గొట్టుకునేలా చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…
దుస్తులు కొనేందుకు షాప్ కు వెళ్లిన ఓ యువతి అక్కడ పాము డిజైన్లతో కొత్తగా వచ్చిన లెగ్గిన్స్ ను చూసి మనసు పారేసుకుంది. అది నచ్చడంతో వెరైటిగా ఉందని ఓ జత కొన్నది. ఫ్యాషన్ డిజైన్ దుస్తులు కొని ఇంటికి వచ్చింది. లెగ్గిన్స్ ను వేసుకొని అవి చూసి భర్త పాములు అనుకొని భయపడుతాడని అనుకుంది. భర్తను ఆటపట్టించేందుకు ప్లాన్ సిద్దం చేసింది.
భర్త రాత్రి ఆఫీసు నుంచి వచ్చాడు. బెడూరూంలో ఆమె కాళ్లకు లెగ్గిన్స్ వేసుకొని కనిపించింది. పాముల లాగ ఆమె తన కాళ్లను కదిలించింది. దీంత భర్త ఆ కాళ్లను చూసి అవి నిజంగానే పాములు అనుకొని భయపడి భయంతో బయటికి వెళ్లి బాస్కెట్ బాల్ ఆడే బ్యాట్ తో ఆమె కాళ్ల పై కొట్టాడు. దీంతో ఆమె అరిచింది. తన భార్య కూడా భయపడిందనుకొని మరో దెబ్బ కొట్టాడు. అప్పుడు ఆమె కెవ్వుమని ఏడుస్తూ అవి నా కాళ్లు అని చెప్పింది.
వెంటనే షాక్ అయిన భర్త ఆమెను ఓదార్చి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె కాళ్ల ఎముకలు విరిగాయని చెప్పారు. ఆరు నెలల తర్వాతే ఆమె పూర్తి స్థాయిలో నడవగలదని అప్పటి వరకు పూర్తిగా బెడ్ రెస్ట్ చెప్పారు. ఇప్పుడు ఈ నిజ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏదో అనుకుంటే ఏదో అయిందే అని అంతా కామెంట్లు చేస్తున్నారు.