రైతు పోరు తీవ్రతరం .. నిరాహార దీక్షకి దిగిన రైతులు

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ ‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. సోమవారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల నేతలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. చలో ఢిల్లీ’లో భాగంగా ఢిల్లీ–జైపూర్‌ హైవే ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు ఆదివారం మధ్యాహ్నం నుంచి షాజహాన్‌పూర్‌ వద్ద హైవేపైకి చేరుకుంటున్నారు.

Farmer unions to be on hunger strike on December 14 against farm laws - Sakshi

రైతు సంఘాల పిలుపు మేరకు ఆల్వార్‌ జిల్లా షాజహాన్‌పూర్‌ వద్ద జాతీయ రహదారి వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్, హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, మేథా పాట్కర్, సీపీఎం నేత ఆమ్రా రామ్‌ తదితరులు వీరిలో ఉన్నారు.

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు సోమవారం ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష పాటిస్తారని రైతు సంఘం నేత గుర్నామ్‌ సింగ్‌ చదుని తెలిపారు. దీంతో పాటు సోమ వారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరుగుతాయన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు యథాప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు.