నటి సుమలతకు ఎదురు దెబ్బ, ఆఖరి మాట చెప్పేసిన కాంగ్రెస్

నటి, మాజీ కాంగ్రెస్ కేంద్ర మంత్రి అంబరీష్ భార్య సుమలకు మాండ్య లోక్ సభ సీటు ఇవ్వడం జరగదని కాంగ్రెస్ తెగేసి చెప్పింది. హుబ్బలి ఎయిర్ పోర్టుల విలేకరులతో మాట్లాడుతూ కర్నాటక కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వ కోర్డినేషన్ కమిటీ ఛెయిర్మన్  సిద్ధరామయ్య ఈ విషయం చెప్పారు.

ఇంక ఇండిపెండేంటుగా పోటీ చేయాల వద్దా అనేది ఆమెఇష్టాయిష్టాలకే వదిలేస్తున్నట్టు ఆయన చెప్పారు.

తన భర్త ఒకపుడు ప్రాతినిధ్యం వహించిన మాండ్య లోక్ సభ నియోజకవర్గం టికెట్ తనకే ఇవ్వాలని సుమలత పట్టుబడుతున్నారు. మండ్యా కాంగ్రెస్ ఇదే వత్తిడి తెస్తున్నది.అయితే, ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేయాలనుకుంటున్నారు. దీనితో సీట్ల పంపకం ఒక కొలిక్కి రాకుండా పోతున్నది. ఒక దశలో తాను మైసూరు కొడగు లోక్ సభ కు పోయేందుకు నిఖిల్ సుముఖం వ్యక్తం చేశారు. అపుడు సుమలత మద్దతు దారులు సంతోషం వ్యక్తం చేశారు. మైసూరు జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తూ మైసూరు ప్రజల ఆశీస్సులను కోరారు నిఖిల్.

అయితే, యాంటిక్లయిమాక్స్. సిద్దరామయ్య ప్రకటన చివరి మాటే. మాండ్య నుంచి జెడి (ఎస్ ) అభ్యర్థియే పోటీ చేస్తారని ఆయన చెప్పారు.

పార్టీ చేయించిన ఒక సర్వే ప్రకారం జెడిఎస్, కాంగ్రెస్ లకు లోక్ సభ ఎన్నికల్లో 20 స్థానాలు లభించనున్నాయని ఆయన వెల్లడించారు