రెండో పెళ్లి చేసుకునే వాళ్లకు భారీ షాక్.. ప్రభుత్వ అనుమతి కావాలట!

ఈ మధ్య కాలంలో దేశంలో రెండో పెళ్లి చేసుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొదటి భార్య ఏదైనా అనారోగ్య సమస్య వల్ల మృతి చెందినా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ఏదైనా కారణం చేత విడిపోయినా మళ్లీ పెళ్లి చేసుకోవడం జరుగుతోంది. కొంతమంది మొదటి భార్య/భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటుండగా మరి కొందరు మాత్రం విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకుంటున్నారు.

అయితే రెండో పెళ్లి చేసుకోవాలని కోరుకునే వాళ్లకు భారీ షాక్ తగలనుంది. ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను అమలులోకి తెచ్చింది తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాకపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండో పెళ్లి చేసుకోవాలని భావించినా భయపడాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలని భావిస్తే ఈ నిబంధన అమలు కానుంది. ఈ రూల్ పెట్టడానికి గల కారణం మాత్రం తెలియాల్సి ఉంది. జీవిత భాగస్వామి మరణించినా లేదా దంపతులు విడాకులు తీసుకున్నా రెండో పెళ్లి చేసుకోవాలని భావిస్తే డిపార్టుమెంట్ హెడ్ కు కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. భార్య లేదా భర్త మరణిస్తే అందుకు సంబంధించిన ఆధారాలను ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మొదటి భార్య అంగీకారం లేకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం ప్రభుత్వం వాళ్లకు పథకాలను, సౌకర్యాలను నిలిపివేయనుందని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ మధ్యలోనే మృతి చెందినా బీహార్ ప్రభుత్వం మొదటి భార్య, పిల్లలకు ఇచ్చిన స్థాయిలో రెండో భార్య, పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది. బీహార్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అమలు చేస్తాయేమో చూడాల్సి ఉంది.