గౌరవమైన వృత్తిలో ఉంటూ మహిళా పేషంట్ పట్ల రాక్షసంగా ప్రవర్తించిన డాక్టర్..?

ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లను ప్రజలు దేవుళ్లతో సమానంగా భావిస్తారు. అయితే ఇలా ఇంత గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ కొందరు డాక్టర్లు తమ వృత్తికి కళంకం తెచ్చే పనులు చేస్తూ ఉంటారు. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్ ఒక నీచమైన పనికి ఒడిగట్టాడు. తన కామ వాంచ నెరవేర్చుకునే క్రమంలో తన వద్దకు ట్రీట్మెంట్ కు వచ్చిన మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పలు మార్లు అత్యాచారం చేసిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన ఛత్తీస్ ఘడ్ లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలోద్ లో ఉన్న సంజీవని ఆసుపత్రి లో పని చేసే డాక్టర్ శిఖర్ గుప్త ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరోగ్యం సరిగా లేదు అని ఒక మహిళ తరచూ ఈ డాక్టర్ దగ్గరకు వచ్చేది. ట్రీట్మెంట్ నెపంతో ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమె పై పలుమార్లు అఘాయిత్యం చేశాడు. అయితే ఆ మహిళకు పలు మార్లు అనుమానం వచ్చి డాక్టర్ ని ప్రశ్నించగా.. ట్రీట్మెంట్ వలన అల ఉంది అని నమ్మబలికాడు. అయితే ఇటీవల డాక్టర్ సదురు మహిళకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటంతో ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలిపింది.

ట్రీట్మెంట్ పేరుతో తనని మోసం చేశాడని ఆ మహిళ తన కుటుంబ సభ్యులతో పాటు హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని నిలదీశారు. అయితే డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురై డాక్టర్ మీద దాడి చేయటంతో పాటు హాస్పిటల్ కూడా ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ కి వెళ్లి విచారించగా అసలు విషయం పోలీసులకు వివరించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సదరు డాక్టర్ అనేక మంది మహిళల మీద ఈ విధంగా అత్యాచారం చేసినట్లు బయటపడింది. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.