ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా 111 మిం రైతులు పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మోదీ రెండో సారి వారణాసి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. కావేరి జలాలతో పాటు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని తమిళనాడు రైతులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం దాని పై ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడంతో వారు మోదీ వ్యతిరేకంగా పోటి చేసి రైతుల సమస్యలను దేశ వ్యాప్తంగా ప్రజలల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని రైతులు ఇప్పటికే ప్రకటించారు. 111 మంది రైతులు నామినేషన్ వేయనున్నారు.