సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రివ్యూ, రేటింగ్..
సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రివ్యూ, రేటింగ్.. కరోనా కోరలు చాచడంతో మూతపడ్డ థియేటర్స్ ఈ రోజు సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో తిరిగి తెరుచుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. 9 నెలల తర్వాత థియేటర్స్‌లో విడుదలైన తొలి చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ కావడంతో ఈ సినిమాకి ఇండస్ట్రీ పెద్దల నుండి మంచి సపోర్ట్ లభించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలని అనడంతో మూవీపై క్రేజ్ అమాంతంగా పెరిగింది. మరి సినిమా ఎలా ఉంది? థియేటర్స్‌లోనే చూసే సినిమానా ఇది అనేది ఇప్పుడు చూద్ధాం.
సోలో బ్రతుకే సో బెటర్ మూవీ కథ:
సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంలో పెళ్లంటే ఇష్టపడని సాయిధరమ్ తేజ్ అందరికి పెళ్ళి చేసుకోవద్దని సూచిస్తుంటాడు. మనల్ని స్వేచ్చగా బ్రతకమని రాజ్యాంగం హక్కులు కల్పిస్తే మనమేమో పెళ్లి పేరుతో స్వేచ్చని నాశనం చేసుకుంటున్నామని అంటాడు విరాట్(సాయిధరమ్ తేజ్ ). ఆర్ నారాయణమూర్తిని ఆదర్శంగా తీసుకొనే విరాట్‌పై తన మామయ్య( రావు రమేష్) ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. విరాట్ తన కాలేజ్ స్టడీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో జాబ్ కొడతాడు. దీనికోసం హైదరాబాద్ వచ్చిన విరాట్‌కు అమృత( నభా నటేష్) పరిచయం అవుతుంది. విరాట్ కోసం తన పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుంటుంది. వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి ఎలాంటి మలుపులు తిరుగుతుంది, రావు రమేష్ ఎఫెక్ట్ తేజూపై ఎలా పడుతుందనేది సినిమా కథ.
ఎవరెవరు ఎలా నటించారంటే…
ప్రతి సినిమాకు తన టాలెంట్‌ను పెంచుకుంటూ పోతున్న సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సోబెటర్ చిత్రంలో విరాట్‌గా నట విశ్వరూపం చూపించాడు. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా నటించాడు. ప్రతి సీన్‌లోను పండించాడు. నభా నటేష్ మన ఇంట్లో అమ్మాయిలా అందరికి కనెక్ట్ అయింది. ఇక రావు రమేష్ మరోసారి తన పాత్రకు న్యాయం చేశారు. వెటకారపు మాడ్యులేషన్ లో, ఇటు ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, నరేష్, వెన్నెల కిషోర్, సత్య తమ పాత్రలతో మెప్పించారు.
ఆఫ్ స్క్రీన్ టాలెంట్
సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో దర్శకుడిగా మారిన సుబ్బు చెప్పాలనుకున్న పాయింట్‌ని సూటిగా సుత్తిలేకుంగా చెప్పాలనుకున్నప్పటికీ మధ్యలో డైవర్ట్ అయ్యాడని అనిపిస్తుంది. సెకండాఫ్‌లో రొటీన్‌గా అనిపించడంతో పాటు ప్రేమ కథని సరిగ్గా ముందుకు తీసుకెళ్లలేదేమోననే భావన కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త కామెడీగా అనిపించిన సెకండాఫ్ పాత చింతకాయ పచ్చడిలానే అనిపిస్తుంది. సుబ్బు అనుకున్న పాయింట్ ని రావు రమేష్ ద్వారా చెప్పగలిగారు కానీ హీరో – హీరోయిన్ పాత్రలో అంత బాగా చెప్పలేకపోయారు. ఎమోషనల్ సీన్స్ సమయంలో సుబ్బు రాసుకున్న డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
ప్రతి సినిమాలో తన సంగీతంతో అలరించే థమన్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. వీన్ నూలి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో బాగా అనిపించినా, సెకండాఫ్ లో మాత్రం బోరింగ్ గా అనిపిస్తుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి.
పాజిటివ్ పాయింట్స్
– సాయితేజ్ సోలో పర్‌ఫార్మెన్స్
– రావు రమేష్ యాక్టింగ్
– ఫస్టాఫ్ కామెడీ
– సుబ్బు రాసుకున్న ఎమోషనల్ డైలాగ్స్
నెగెటివ్ పాయింట్స్
– సెకండాఫ్ సుత్తిలా అనిపించడం
– క్లైమాక్స్ అందరికి తెలిసిందే కావడం
– వెన్నెల కిషోర్‌ని సరిగ్గా వాడుకోలేకపోవడం
– చెప్పాలనుకున్న పాయింట్‌ని సరిగ్గా చెప్పలేకపోవడం
విశ్లేషణ:
తొమ్మిది నెలల తర్వాత థియేటర్‌లోకి వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాని ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేసే సరికి మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో అభిమానులు అందరు థియేటర్స్‌కు క్యూ కట్టగా వారికి అనుకున్నంత వినోదం కరువైంది. సినిమా సోసోగా ఉందని అంటున్నారు. కరోనా టైంలో రిస్క్ చేసి థియేటర్‌కు వెళ్ళి చూడాల్సిన సినిమా కాదని అంటున్నారు.చాలా రోజులుగా థియేటర్‌లో సినిమా చేసే ఛాన్స్ లేకపోవడం వలన కాస్త బోరింగ్ గా ఫీలైన ప్రేక్షకులు మాత్రమే సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని చూడవచ్చు.