రెండేళ్ళ గ్యాప్ తర్వాత హీరో ఆది సాయికుమార్ తన అపజయాల స్పీడ్ బ్రేకర్ దాటాలని ‘బుర్రకథ’ తో వస్తున్నాడు. రెండు బుర్రల క్యారక్టర్ గా ముస్తాబయ్యాడు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ విడుదల చేశారు. తాజాగా కాసేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఆది మైండ్ రెండు రకాలుగా ఆలోచిస్తుందని, ఇద్దరిగా ప్రవర్తిస్తాడని ఒక అయిడియా అందించారు. ఒక పాత్ర యాక్షన్ ఓరియెంటెడ్ అభి అయితే, ఇంకో పాత్ర భక్తి ఓరియెంటెడ్ రామ్. అభి లవ్ అంటే, రామ్ మతం అంటూ సన్యాసి గెటప్ లో వుంటాడు.
ప్రారంభంలోనే నా శత్రువు నాలోనే వున్నాడని డైలాగు ఇచ్చారు. ముగింపులో ఇద్దరూ ఇంకోలాగా ఎప్పుడాలోలిచిస్తారో నని ఇంకో డైలాగు ఇచ్చారు. ఈ రెండిటి మధ్య విలన్ గ్యాంగ్స్ తో యాక్షన్, హీరోయిన్ తో రోమాన్స్, పాటలు పెట్టారు. ఇవన్నీ చూసేసిన రొటీన్ ఫార్ములాగా వున్నాయి.
ఈ రెండు బుర్రల ట్రైలర్ చూస్తూంటే కాస్త ‘అపరిచితుడు’ లా అన్పిస్తున్నాడు. ఇంకాస్త ‘ఓహ్ బేబీ’ లా అన్పిస్తున్నాడు. ‘అపరిచితుడు’ గురించి తెలిసిందే. ‘ఓహ్ బేబీ’ లో సమంత యంగ్ క్యారక్టర్ లో 70 ఏళ్ల బామ్మ వుంటుంది. ఇక ‘గేమ్ ఓవర్’ లో తాప్సీలో ఒక ఆత్మ వుంటుంది. ఇక తనలో కవల సోదరుడున్న ‘సవ్యసాచి’ వుండనే వున్నాడు.ఏమిటో ఇలా ఒకరిలో ఇంకొకరు దూరిపోయే సినిమాలు ఇన్ని వచ్చేస్తున్నాయి.
రెండు బుర్రల పాయింటు తప్ప మిగతా విషయం అతి రొటీన్ గా కన్పిస్తున్న ఈ ట్రైలర్ ఎంతవరకు ఒపెనింగ్స్ నిస్తుందో చూడాలి. ట్రైలర్ మాత్రం క్రేజ్ సృష్టించడం లేదు. ఇందులో హీరోయిన్ గా మిస్తీ చక్రవర్తి నటించింది. ఇంకో హీరోగా నైరాషా నటించింది. పృథ్వీ తో బాటు రాజేంద్రప్రసాద్, ప్రద్యుమ్న సింగ్ వున్నారు. సంగీతం సాయి కార్తీక్, కెమెరా రాంప్రసాద్. బ్యానర్ దీపాల, నిర్మాత హెచ్ కే దీపాల.
ఇక ప్రముఖ డైలాగ్స్ రచయిత డైమాండ్ రత్నబాబు తను కూడా దర్శకుడుగా మారి ‘బుర్ర కథ’ ని రూపొందించారు. ఇది తన కెరీర్ కి ఎంత వరకు హిట్ కతా వుతుందో చూడాలి. జూన్ 28 న విడుదల.