‘రా’ అంటున్న గోపీచంద్ – ‘చాణక్య’ టీజర్ రివ్యూ!

‘రా’ అంటున్న గోపీచంద్ -‘చాణక్య’ టీజర్ రివ్యూ!

యాక్షన్ హీరో గోపీచంద్ ఇక స్పై మూవీతో వచ్చేస్తున్నాడు. ఐదేళ్లుగా హిట్ అంటూ లేని తను సక్సెస్ ని టార్గెట్ చేస్తూ ‘చాణక్య’ గా మోత మోగించ బోతున్నాడు. విశాల్ తో కిలాడీ, ఇంద్రుడు వంటి యాక్షన్ సినిమాలు తీసిన తమిళ దర్శకుడు ఈ సారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నిమిషం పాటున్న ఈ టీజర్ స్పై యాక్షన్ దృశ్యాలతో బ్లాస్టవుతోంది. ‘రా’ ఏజెంట్ గా గోపీచంద్ ఏకంగా పాకిస్తాన్లో భారీ ఆపరేషన్ కి సాహసించిన దృశ్యాలిందులో వున్నాయి. ‘నామ్ హై అర్జున్… ఇండియన్’ అంటూ అక్కడి విలన్లకి సవాలు విసురుతున్న డైలాగు వుంది. అయితే ఆపరేషన్ దేని గురించో రివీల్ కాలేదు. పరాయి దేశంలో టెర్రర్ క్యాంపుల మీద దాడులు చేస్తున్న, వాళ్ళ వేషంలోనే వున్న అండర్ కవర్ ఏజెంట్ లా గోపీ చంద్ కన్పిస్తున్నాడు. యాక్షన్ సీన్స్ విజువల్స్ రిచ్ గా వున్నాయి. టెర్రరిజం మీద ఇంకేదైనా కొత్త పాయింటుతో వస్తే ఈ మూవీకి బెటర్ గా వుంటుంది.

ఈ స్పై థ్రిల్లర్ లో మెహ్రీన్‌ ప్రేయసిగా,, జరీన్‌ ఖాన్‌ స్పైగా నటిస్తున్నారు. తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించిన ఈ మూవీకి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.టీజర్ మీద ఓ లుక్కేయండి!