YS Jagan: అఖిల్ అక్కినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు నాగార్జున అధికారకంగా వెల్లడించారు. ఇదివరకే అఖిల్ శ్రియ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకొని కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా జైనాబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నట్లు నాగార్జున అధికారకంగా వెల్లడించారు. ప్రస్తుతం వీరి నిచ్చితార్థపు ఫోటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా ఒకసారి గా నాగార్జున అఖిల్ నిశ్చితార్థం జరిగింది అంటూ వీరి ఫోటోలను షేర్ చేయడంతో అసలు అఖిల్ పెళ్లి చేసుకోబోయే ఈ అమ్మాయి ఎవరు ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రముఖ బిజినెస్ మేన్ జుల్ఫీ రవ్జీ కుమార్తె అని తెలుస్తుంది. ఈయనకి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇక ఈయన ఓడియన్ థియేటర్స్ అధినేత అని చెప్పాలి. ఇక జైనాబ్ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇకపోతే ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుడిగా పని చేయడమే కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు. అలాగే జగన్, నాగార్జునల ఫ్యామిలీలతో ఎంతో మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. మొత్తానికి అఖిల్ భారీ సినీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఇంటికి అల్లుడుగా వెళ్లబోతున్నారని తెలుస్తుంది.
ఇక అఖిల్ నిశ్చితార్థం జరగగా పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలపై అభిమానులు ఆరా తీస్తున్నారు. నాగచైతన్య శోభిత వివాహ డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది. మరి అఖిల్ జైనాబ్ పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి అక్కినేని ఇద్దరి వారసుల గురించి నాగార్జున ఇలాంటి శుభవార్త చెప్పడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.